చలికాలంలో ఆరోగ్యపరంగా ఎగుడుదిగుడులు కచ్చితంగా ఉంటాయి. చలికాలం ఇబ్బందుల్ని దూరం చేయాలంటే ప్రధానంగా కావల్సింది సరైన డైట్. అంటే రోజు ప్రారంభం ఆరోగ్యకరమైన ఆహారంతో ఉండాలి. ఆ వివరాలు తెలుసుకుందాం..
రోజు ప్రారంభం గుడ్డుతో మొదలైతే ఆరోగ్యం బాగుంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గుడ్లలో చాలా రకాల పోషక పదార్ధాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరం. గుడ్లను ఫ్లై చేసి తినేకంటే..ఉడకబెట్టి తినడం మంచిది. బాయిల్డ్ ఎగ్ అనేది మంచి ప్రత్యామ్నాయం. ఫలితంగా శరీరం ఇమ్యూనిటీ పెరుగుతుంది. బరువు వేగంగా తగ్గుతారు. చలికాలంలో బాయిల్డ్ ఎగ్ తినడం వల్ల కలిగే లాభాలేవే తెలుసుకుందాం..
బాయిల్డ్ ఎగ్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. శరీరంలోని అంగాలకు బలం చేకూరుస్తుంది. గుడ్లు రోజూ తినడం వల్ల శరీరంలో అంతర్గతంగా వేడి పెరుగుతుంది. ఫలితంగా చలికాలం ముప్పు తగ్గుతుంది.
గుడ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి అనేది శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఎముకల్ని పటిష్టం చేస్తుంది.
గుడ్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కోలీన్ పెద్దమొత్తంలో ఉంటాయి. మెదడులో సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. చలికాలంలో సహజంగా అధికంగా కన్పించే గుండెపోటు ముప్పు కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
గుడ్లను లీన్ ప్రోటీన్‌తో పాటు ఎమీనో యాసిడ్స్‌కు బెస్ట్ సోర్స్. తక్కువ కేలరీలతో పాటు బరువు తగ్గించడంలో దోహదపడతాయి. చలికాలంలో ఫిట్‌నెస్‌ను మెరుగుపరుస్తుంది. గుడ్లలో విటమిన్ బి6, బీ12, జింక్ పుష్కలంగా ఉంటాయి. బాడీ ఇమ్యూనిటీని పెంచేందుకు కీలకంగా మారతాయి.
Also read: Health Tips: మొబైల్ లేదా టీవీ చూస్తూ భోజనం చేస్తున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook