చలికాలంలో జలుబు, దగ్గు సమస్యలు సాధారణం. దాంతోపాటు గొంతులో గరగర ప్రధానంగా ఉంటుంది. అయితే గొంతులో గరగర సమస్యను తేలిగ్గా తీసుకోవద్దంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపించవచ్చు. జలుబు, దగ్గుతో పాటు గొంతు గరగర సమస్య ఉంటుంది.
కరోనా వైరస్
గొంతులో నొప్పి, గరగర అనేది కరోనా ప్రధాన లక్షణాల్లో ఒకటి. కరోనా వైరస్ ఇంద్రియాలపై ప్రభావం చూపిస్తుంది. ఇమ్యూనిటీని బలహీనం చేస్తుంది. ఫలితంగా జ్వరంతో పాటు చలి, దగ్గు, గొంతులో గరగర సమస్యగా మారతాయి. అందుకే ఈ సమస్యలున్నప్పుడు అప్రమత్తం కావాలి.
కాలుష్యపు గాలి
కాలుష్యపు గాలిలో శ్వాస తీసుకోవడం కష్టమైపోతోంది. వాయు కాలుష్యం ఊపిరితిత్తుల్ని బలహీనం చేస్తుంది. కాలుష్యం వల్ల ముక్కు, నోరు, గొంతులో మంట ఏర్పడుతుంది. ఉదయం వేళ గొంతు గరగరగా ఉంటే కాలుష్యపు గాలి నుంచి కాపాడుకోవాలి. చలికాలంలో కాలుష్యం కారణంగా గొంతు గరగర ఉంటుంది.
నీటి కొరత
చలికాలంలో శరీరంలో నీరు తక్కువైతే డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. నీటి కొరత కారణంగా గొంతెండిపోతుంది. గొంతు గరగర ఉంటుంది. గొంతులో మంట, గరగర నుంచి ఉపశమనం పొందాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి.
ఎలర్జీ
జలుబు, దగ్గు, గొంతులో గరగర ఎలర్జీ ముఖ్య లక్షణాల్లో ఒకటి. ఉదయం దుమ్ము కారణంగా ఎలర్జీ ఉత్పన్నమౌతుంది. గొంతు గరగర సమస్య ఇబ్బందిగా మారుతుంది. పర్‌ఫ్యూమ్, పూలు, పెంపుడు జంతువుల వల్ల ఎలర్జీ కూడా గొంతు గరగరకు కారణమౌతుంది.
గొంతు గరగర తగ్గించేందుకు ఏం చేయాలి
గొంతులో గరగర సమస్యను దూరం చేసేందుకు ఉప్పు నీళ్లతో పుక్కిలించడం మంచి పద్ధతి. తేనె సేవించడం ద్వారా గొంతు గరగర సమస్య దూరమౌతుంది. అల్లం టీ, కాడా కూడా మంచి మెరుగైన పద్ధతులు.
Also read: Cholesterol Tips: ఈ డ్రింక్స్ రోజూ తీసుకుంటే చాలు..28 రోజుల్లో కొలెస్ట్రాల్ మటుమాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Sore Throat: గొంతులో గరగరను తేలిగ్గా తీసుకుంటే ప్రమాదం, ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు