Winter Skin Care: చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే ఈ నూనెను ఇలా వాడండి..!

Winter Skin Care Routine At Home: చలికాలంలో  పెదాలు, కళ్ళు, చేతులు పదే పదే పగులుతుంటాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఆరోగ్యకరమైన నూనెలను ఉపయోగించాల్సి ఉంటుంది. చలికాలంలో బాదం నూనె ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం.   

Written by - Shashi Maheshwarapu | Last Updated : Nov 6, 2024, 11:31 AM IST
Winter Skin Care: చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే ఈ నూనెను ఇలా వాడండి..!

Winter Skin Care Routine At Home: చలికాలంలో చర్మం పొడిబారడం అనేది చాలా మంది ఎదుర్కొనే సమస్య.  ఈ సమయంలో చర్మపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.  చలికాలంలో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది కాబట్టి చర్మం తేమను కోల్పోతుంది. దీని వల్ల పొడిబారుతుంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంలో ఉండే నూనెలు తొలగిపోతాయి. 

చల్లని గాలి చర్మాన్ని ఎండిపోయేలా చేస్తుంది. వేడి వాయువులు, తక్కువ నీరు తాగడం, కొన్ని రకాల సబ్బులు, క్లీనర్లు కూడా చర్మం పొడిబారడానికి కారణమవుతాయి. చలికాలంలో చర్మం పొడిబారినప్పుడు, జిడ్డుగల చర్మం కూడా పొడిబారి, చికాకు కలిగించేలా మారవచ్చు. ఈ సమయంలో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల చర్మ సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు. ముఖ్యంగా బాదం నూనె ఉపయోగించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందని చర్మనిపుణులు చెబుతున్నారు. ఇది చలికాలంలో చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం. 

బాదం నూనె లాభాలు: 

బాదంలో నూనెలో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. ఇది చర్మం పొడి బారకుండా చేస్తుంది. ప్రతిరోజు రాత్రి పడుకొనే ముందు చర్మంపై బాదం నూనె రాసుకోవడం మంచిది. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్‌ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. దీని చేతులకు, ముఖాన్నికి రాసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా మంది నల్లటి వలయాలతో బాధపడుతుంటారు. ఈ సమస్య వల్ల కళ్ళు చికాకుగా ఉన్నాయి. బాదం నూనె రాసుకోవడం వల్ల డార్క్ సర్కిల్స్ సమస్యను తగ్గిస్తుంది.  దీని ప్రతిరోజు రాత్రి కళ్ల కింద రాసుకొని మాసాజ్ చేసుకుంటే రెండు వారాల్లో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. 

ప్రస్తుతకాలంలో చాలా మంది ట్యాన్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీని తొలగించడానికి వివిధ రకాల క్రీములు, ప్రొడెక్ట్స్‌ను ఉపయోగిస్తారు. కానీ సహాజంగా దీని తొలగించుకోవచ్చు. ఒక సూప్‌ బాదం నూనె, లెమెన్‌ జ్యూస్‌, తేనెను కలుపుకోవాలి. దీని టాన్‌ ఉన్నచోట రాసుకోవడం వల్ల కొద్ది రోజుల్లో టాన్‌ తొలుగుతుంది. దీని ట్రై చేసే ముందు చిన్న ప్యాచ్‌ తో వాడండి.  అంతేకాకుండా బాదం నూనె మడమ పగుళ్లకు కూడా ఎంతో సహాయపడుతుంది. రాత్రి పూట ఉపయోగించడం వల్ల ఇది పగుళ్లను తొలగిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ కూడా తొలుగుతుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌  ఉండవు. చలికాంలో పెదాలు పగలడం ఎంతో సహాజం. పెదాలకు బాదం నూనె రాయడం వల్ల నల్ల మచ్చలు, పగుళ్లు తగ్గుతాయి. 
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News