ACB Raids: ఏసీబీ చేతికి మరో అవినీతి తిమింగలం చిక్కింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) మాజీ డైరెక్టర్, తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్‌ఆర్‌ఈఆర్‌ఏ) కార్యదర్శి శివ బాలకృష్ణ ఇల్లు, కార్యాలయం, ఆయన బంధువుల ఇళ్లపై దాడులు చేసి రూ.100 కోట్లకుపైగా అక్రమాస్తులను స్వాధీనం చేసుకుంది. 14 బృందాలు 20 చోట్ల చేపట్టిన ఈ సోదాల్లో 40 లక్షల నగదు, లగ్జరీ వాచీలు, బంగారు ఆభరణాలు, 60 అత్యాధునిక చేతి గడియారాలు మరియు డజన్ల కొద్దీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను గుర్తించినట్టు తెలిసింది. శివ బాలకృష్ణ అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలకు అనుమతులు ఇప్పించడం ద్వారా కోట్లకు కోట్లు కూడబెట్టారని ఏసీబీ ఆరోపించింది.
రైడింగ్ బృందాలు హెచ్‌ఎండీఏ, రెరా కార్యాలయాల్లోనూ తనిఖీలు చేశాయి. బాలకృష్ణ ఇంటితో పాటు విచారణకు సంబంధించిన ఇతర కీలక ప్రదేశాల్లో కూడా సోదాలు జరిగాయి. తన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడుల్లో ఫ్లాట్లు, బ్యాంకు డిపాజిట్లు, బినామీ ఆస్తులు బయటపడ్డాయి. 14 ఫోన్లు, 10 ల్యాప్‌టాప్‌లు, పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశాలున్నాయంటూ ఏసీబీ అధికారులు వెల్లడించారు. బాలకృష్ణపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు అధికారులు తెలిపారు. అతని బ్యాంక్ లాకర్లు మరియు ఇతర వెల్లడించని ఆస్తులను కూడా ఏసీబీ పరిశీలిస్తోంది.
Also Read: TSPSC: కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ పోలీసు బాస్..
Also Read: MP Bandi Sanjay: ఎన్నికల్లో మీ దమ్మేందో చూపించండి.. ఓటనే ఆయుధంతో ఉచకోత కోయండి: బండి సంజయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook