Musi Floods: మూసీ నది ఉగ్రరూపం.. అలర్ట్ అయిన ప్రభుత్వ యంత్రాంగం..

Heavy Rains: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జలాశయాల్లో భారీగా వరద ప్రవాహం పెరిగింది.  దీంతో అధికారులు దిగువన  ఉన్న మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 27, 2023, 12:34 PM IST
Musi Floods: మూసీ నది ఉగ్రరూపం.. అలర్ట్ అయిన ప్రభుత్వ యంత్రాంగం..

Musi Floods latest: భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న నీటితో హైదరాబాద్ నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), హిమాయత్‌సాగర్‌ జలకళను సంతరించుకున్నాయి. ఈ రెండింటిలో వరద ప్రవాహం పెరగడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇవాళ ఉస్మాన్‌సాగర్‌ 2 గేట్లు, హిమాయత్ సాగర్ 6 గేట్లు ఎత్తి కిందకు నీటిని వదులుతున్నారు.  దీంతో మూసీనదిలో వరద ప్రవాహం భారీగా పెరిగింది. అలర్ట్ అయిన అధికారులు నదీ పరిహవాక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కిషన్‌బాగ్‌ పురానాపూల్‌, జియాగూడ ఏరియాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు, విపత్తు నిర్వహణ బృందలు, పోలీసులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

మరోవైపు నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండటంతో 7 గేట్లు ద్వారా నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుత సామర్థ్యం 642.50 అడుగులకు చేరింది. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం నీటమునిగింది. మోరంచ వాగు ఉప్పొంగడం వల్ల ఆ గ్రామం జలదిగ్భందంలో చిక్కుకుంది. చాలా మంది ప్రజలు ఇంటి స్లాబ్‌లపై తలదాచుకున్నారు.  కొందరు చెట్లపైన, స్తంభాలపైకి ఎక్కి కూర్చున్నారు. దీంతో పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరిలిస్తున్నారు. 

Also Read: Godavari Water Level: భద్రాచలం వద్ద 50 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News