తిరువనంతపురం: దేశవ్యాప్తంగా కరోనా (Coronavirus cases) మహమ్మారి కొత్త రూపాన్ని దాల్చుతోంది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టడికి పకడ్బందీ చర్యలు చర్యలు చేపడుతున్నప్పటికీ కేసులు మాత్రం తగ్గడంలేదు. విజృంభణ తగ్గిందన్న కేరళలో శనివారం కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ తెలియజేశారు.
Also Read: వారి ఖాతాల్లోకి డబ్బులు చేరాలి.. ఆర్ధిక ప్యాకేజీపై ప్రధాని పునరాలోచించాలి... రాహుల్ గాంధీ
Kerala రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 560కి చేరుకోగా, వైరస్ బారిన పడి ఇప్పటివరకు 4 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో కోవిడ్-19 వివరాలు త్రిసూర్ నుండి 4, కోజికోడ్ నుండి 3, పాలక్కడ్ నుండి 2, మలపురం జిల్లా నుండి 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. రాష్ట్రంలో 87 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నట్లు ఆమె వెల్లడించారు. దీనికి గాను ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా కోవిడ్ వ్యాప్తిని ఏర్పాటు చేసిన బృందాలను అప్రమత్తం చేస్తున్నామని, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అన్నీ రకాల జాగ్రత్తలు, సూచనలు అధికారులకు తెలియజేస్తున్నామన్నారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..