11 people died after consuming poisonous liquor in Morena | మోరెనా: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 11 మంది మరణించారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లా (Morena District)లోని, బాగ్చిని, సుమవాలి పోలీస్‌స్టేషన్ల పరిధిలో చోటు చేసుకుంది. మోరెనా జిల్లాలోని రెండు గ్రామాలకు చెందిన పలువురు రెండు రోజుల క్రితం కల్తీ మద్యం (consuming poisonous liquor) తాగారు. ఆ తర్వాత వారు అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే వారి కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే అస్వస్థతకు గురైన వారిలో ఇప్పటివరకు 11 మంది మరణించారు. ఇంకా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని.. పలువురు ఇంకా చికిత్స పొందుతున్నారని మోరెనా ఎస్పీ అనురాగ్ సుజానియా తెలిపారు.
సమచారం అందుకున్న ఉన్నతాధికారులు, పోలీసులు మోరెనా జిల్లాలోని ఛేరా మాన్‌పూర్, పహ్వాలి గ్రామాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నివేదిక అనంతరం పలు వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. మృతులందరూ 23 నుంచి 55 ఏండ్ల వయసు లోపు వారేనని.. ఇప్పటికే పలువురి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాట్లు వెల్లడించారు. Also Read: Covishield: రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్ రవాణా
I'm deeply saddened by this. SHO has been suspended immediately. Senior officials have reached the site. A team will investigate the matter. Accused won't be spared: Madhya Pradesh Minister Narottam Mishra on 10 people died after consuming poisonous liquor in Morena pic.twitter.com/l73eDOyhjr
— ANI (@ANI) January 12, 2021
ఇదిలాఉంటే.. ఈ విషయంపై ఎంపీ (Madhya Pradesh) మంత్రి నరోత్తం మిశ్రా స్పందించారు. ఈ వార్త విని చాలా బాధపడ్డానని.. వెంటనే స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై సీనియర్ అధికారుల బృందం సమగ్ర దర్యాప్తు చేస్తోందని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని నరోత్తం మిశ్రా తెలిపారు. అంతకుముందు గతేడాది అక్టోబర్‌లో కూడా ఉజ్జయినీలో కల్తీ మద్యం (liquor) తాగి 16 మంది, రత్లం జిల్లాలో 8మంది మరణించారు. Also Read: Rajinikanth: నొప్పించకండి ప్లీజ్.. రాజకీయాల్లోకి రాలేను: తలైవా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook