ఐపీఎస్ ఆఫీసర్లలో 119 మంది ఫెయిల్.. ముగ్గురే పాస్

వారంతా కాబోయే  పోలీసు బాసులు.

Last Updated : Jul 8, 2018, 12:15 PM IST
ఐపీఎస్ ఆఫీసర్లలో 119 మంది ఫెయిల్.. ముగ్గురే పాస్

హైదరాబాద్: వారంతా కాబోయే  పోలీసు బాసులు. అలాంటి వారు సాధారణ పరీక్షల్లో ఫెయిలయ్యారు. వివరాల్లోకి వెళితే.. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ(ఎస్‌వీపీఎన్‌పీఏ)లో 2016 బ్యాచ్ కు చెందిన 122 మంది పోలీసు శిక్షణ పొందుతున్నారు. వీరిలో 119 మంది పోలీస్ అకాడమీ పరీక్షల్లో ఫెయిలయ్యారు. చాలామంది ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో తప్పారు. మొత్తం బ్యాచ్ 136 మంది కాగా అందులో 14 మంది ఫారెన్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన వారు.

ఎగ్జామ్స్‌లో ఫెయిలైన వీరంతా వారి కేడర్లను బట్టి ప్రొబేషనరీలో ఉంటారని అధికారులు తెలిపారు. వారు తప్పనిసరిగా పరీక్షల్లో పాసైతేనే సర్వీస్ చేసేందుకు అర్హులవుతారని, ఇందుకోసం మూడు అవకాశాలిస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత కూడా ఉత్తీర్ణత కాకుంటే సర్వీసుకు వారు అనర్హులవుతారు.

ఐఏఎస్ ఆఫీసర్లకు ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీలో శిక్షణ ఇస్తుండగా, ఐపీఎస్‌లకు హైదరాబాద్‌లోని ఎస్‌వీపీఎన్‌పీఏ శిక్షణ ఇస్తున్నారు. 2016 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్లలోనూ ఇద్దరు ఫెయిలయ్యారు.

Trending News