వాహనాల తనిఖీల్లో 120 కిలోల బంగారం స్వాధీనం

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో వాహనాలు తనిఖీ చేస్తోన్న అధికారులు ఓ వాహనం నుంచి 120 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Last Updated : Mar 22, 2019, 03:58 PM IST
వాహనాల తనిఖీల్లో 120 కిలోల బంగారం స్వాధీనం

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో వాహనాలు తనిఖీ చేస్తోన్న పోలీసులు ఓ వాహనం నుంచి 120 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో వున్నందున ఘాజియాబాద్ జిల్లా మోడీనగర్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగానే అటుగా వచ్చిన ఓ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 120 కిలోల బంగారం బయటపడింది. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు ఈ ఘటనలో ఇద్దరు సెక్యురిటీ గార్డులు, ఒక డ్రైవర్, క్యాషియర్‌ని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.38 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 

ఢిల్లీ నుంచి ఉత్తర్ ప్రదేశ్‌లోని హరిద్వార్‌కి ఈ బంగారాన్ని తరలిస్తున్నట్టు పోలీసుల అదుపులో వున్న వ్యక్తులు తెలిపారు. హరిద్వార్‌లోని ఫ్యాక్టరీలో ఈ బంగారాన్ని బిస్కెట్స్ ఆకారంలోకి మార్చి అక్కడి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించనున్నట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

Trending News