13 years old Girl raped by 80 men in Telangana and Andhra Pradesh States: మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఓ చోట మహిళలు, చిన్నారులు కామాంధులకు బలవుతూనే ఉన్నారు. తాజాగా ఓ 13 ఏళ్ల బాలికపై 80 మంది అత్యాచారం చేశారు. ఈ ఘటన మరెక్కడో జరగలేదు. తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే...
గత సంవత్సరం జూన్ మాసంలో కరోనాతో బాలిక తల్లి ఆస్పత్రిలో చేరింది. అదే సమయంలో సవర్ణ కుమారి అనే మహిళ కూడా ఆసుపత్రిలో చేరి బాలిక తల్లిని పరిచయం చేసుకుంది. చిన్నారిని దత్తత తీసుకుంటానని చెప్పి మాయమాటలు చెప్పింది. ఆగస్టులో చిన్నారి తల్లి చనిపోయాక.. తండ్రికి చెప్పకుండానే బాలికను సవర్ణ తీసుకెళ్లిపోయింది. చిన్నారి కనపడకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి బాలిక కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఈ ఏడాది జనవరిలో తొలి అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో మంగళవారం (ఏప్రిల్ 19) గుంటూరులోని బ్రోతల్ హౌస్ నుంచి చిన్నారిని కాపాడారు గుంటూరు వెస్ట్ జోన్ పోలీసులు. ప్రధాన నిందితురాలు సవర్ణ కుమారినీ అదుపులోకి తీసుకున్నారు. నిన్న బీటెక్ విద్యార్థితో సహా మరో 10 మందిని అరెస్టు చేశారు. నిందితులు, బాధితురాలిని విచారించిన తర్వాత పోలీసులకు ఆశ్చర్యపోయే విషయాలు తెలిశాయి. గత ఎనిమిది నెలలుగా మైనర్ బాలికను ఏపీ, తెలంగాణలోని వేర్వేరు వ్యభిచార గృహాలకు పంపినట్లు విచారణలో తేలింది.
చిన్నారి వయసు, ఆమె కుటుంబ పరిస్థితిని ఆసరాగా తీసుకుని 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారని ఏఎస్పీ సుప్రజ చెప్పారు. మొత్తంగా 80 మంది నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, కాకినాడల్లో అదుపులోకి తీసుకుని.. 53 సెల్ ఫోన్లు, మూడు ఆటోలు, బైకులను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఓ నిందితుడు ప్రస్తుతం లండన్‌లో ఉండగా.. అతడిని రప్పించేందుకు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితురాలు సవర్ణ కుమారిపై కేసు నమోదు చేశారు.
Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మరో ప్లేయర్‌కు కరోనా పాజిటివ్.. నేటి మ్యాచ్ వాయిదా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook