అప్‌డేట్: నదిలో పడిన వ్యాన్.. 17కి చేరిన మృతుల సంఖ్య!

అప్‌డేట్: నదిలో పడిన వ్యాన్.. 17కి చేరిన మృతుల సంఖ్య! 

Updated: Sep 14, 2018, 11:34 PM IST
అప్‌డేట్: నదిలో పడిన వ్యాన్.. 17కి చేరిన మృతుల సంఖ్య!
ANI photo

జమ్మూకాశ్మీర్‌లోని కిష్టావర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో మృతుల సంఖ్య 17కి చేరింది. పరిమితికి మించిన సంఖ్యలో ప్రయాణికులతో కెశ్వా్న్ నుంచి కిష్టావర్ బయల్దేరిన ఓ మినీ వ్యాన్ శుక్రవారం ఉదయం 9:55 గంటలకు అదుపుతప్పి చీనాబ్ నదిలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొదట 11 మంది మృతి చెందినట్టుగా తెలియరాగా తాజాగా ఆ మృతుల సంఖ్య 17కి చేరినట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది. మరో 16 మంది గాయపడగా వారిలో 11 మందిని హెలీక్యాప్టర్ సహాయంతో జమ్మూలోని ఆస్పత్రికి తరలించినట్టు ఏఎన్ఐ స్పష్టంచేసింది. రోడ్డుపై నుంచి లోతైన నదిలో వ్యాన్ పడిపోవడంతో పై నుంచి తాళ్ల సహాయంతో క్షతగాత్రులను వెలికి తీసి వెనువెంటనే ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

ఘటనాస్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఏఎన్ఐ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.