Airports Bomb Threats: బాంబు బెదిరింపులు దేశంలో ఎక్కడో ఒక చోట భయాందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాలకు నిత్యం ఈ బెదిరింపుల ముప్పు ఉండగా.. తాజాగా దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో విమానయాన రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మొత్తం విమానశ్రయాలను జల్లెడ పట్టి వెతికారు. బాంబుల కోసం వెతకగా ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే తప్పుడు ఫోన్ కాల్‌గా పోలీసులు భావించారు.
Also Read: Chennai: యువకుడి ప్రాణం తీసిన వైఎస్సార్‌సీపీ ఎంపీ కుమార్తె.. కారుతో చెన్నైలో హల్‌చల్
దేశవ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూరు, పాట్నా, వడోదర, జైపూర్‌తో సహా మొత్తం 41 విమానశ్రయాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు వెంటనే క్షుణ్నంగా తనిఖీలు చేపట్టారు. అణువణువు పరిశీలించడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. భద్రతా దళాలు విస్తృతంగా తనిఖీలు చేయడంతో ఏం జరుగుతుందో తెలియక భయపడ్డారు.
Also Read: Uppal Stadium: ఊపిరి పీల్చుకున్న ఉప్పల్ స్టేడియం.. కోట్లలో ఉన్న కరెంట్ బిల్లులు చెల్లింపు
గతంలో ఇలా చాలా
కాగా కొన్ని రోజుల కిందట కూడా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయానికి ఇలాంటి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి టొరంటోకు వెళ్తున్న కెనడా విమానంలో బాంబు ఉందని 13 ఏళ్ల బాలుడు బెదిరింపు మెయిల్ చేశాడు. ఆ సమయంలో పోలీసులు, భద్రతా సిబ్బంది ఎయిర్‌పోర్టులో విస్తృతంగా తనిఖీలు చేసి బాంబు లేదని నిర్ధారించారు. అనంతరం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా బెదిరింపు ఈ మెయిల్ చేసిన బాలుడిపై పోలీసులు చర్యలు తీసుకున్నారని సమాచారం.
#WATCH | DCP Vadodara, Panna Momaya says, "After bomb threat was received through e-mail, an airport committee meeting was convened...The entire airport was searched and no bomb was found. All flights are going in their routine timings...The security at the airport has been… pic.twitter.com/JdNbPNRHy6
— ANI (@ANI) June 18, 2024
Watch: Upon receiving information about a bomb threat targeting 40 airports in India, including Patna Airport, the administration immediately went on high alert. Extensive searches were conducted at the airport, but no suspicious items or objects were found.
(Visuals from Patna… pic.twitter.com/jPgMobNIcd
— IANS (@ians_india) June 18, 2024
Bomb Threat at 40 airports in India
Patna airport director receives threat via mail.. search operation started at airport’s entries.Local police investigating case.. airports in Gujrat and Rajasthan also high alert #BombThreat pic.twitter.com/jRWW3cHoRM
— Kartikey Tripathi (@callmekartikey) June 18, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter