క్యాష్ వ్యాన్‌పై కాల్పులు.. రూ. 52 లక్షలతో దుండగుల పరారీ!

క్యాష్ వ్యాన్‌పై కాల్పులు.. రూ. 52 లక్షలతో దుండగుల పరారీ!

Last Updated : Nov 22, 2018, 06:30 PM IST
క్యాష్ వ్యాన్‌పై కాల్పులు.. రూ. 52 లక్షలతో దుండగుల పరారీ!

క్యాష్ వ్యాన్‌పై కాల్పులు జరిపిన గుర్తుతెలియని దుండగులు అందులో తరలిస్తున్న రూ. 52 లక్షల నగదును ఎత్తుకెళ్లిన ఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు సమీపంలోని సరాయి వద్ద గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో క్యాష్ వ్యాన్‌లో విధుల్లో ఉన్న సెక్యురిటీ గార్డు వినోద్ సింగ్ తీవ్రంగా గాయపడగా పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో రెండు లైవ్ క్యాట్రిడ్జెస్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Trending News