బులంద్‌షహర్: గాఢ నిద్రలో వున్న భక్తులపైకి యాత్రికుల బస్సు వేగంగా దూసుకొచ్చిన ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో గంగా నదీ తీరానికి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతులను హత్రాస్ వాసులుగా గుర్తించారు. అక్కడికి సమీపంలోని నరౌరా ఘాట్‌లో పవిత్ర స్నానం ఆచిరించి తిరుగుప్రయాణమైన భక్తులు.. రాత్రివేళ రోడ్డు పక్కన నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వైష్ణోదేవి ఆలయం నుంచి యాత్రికులతో తిరిగొస్తున్న బస్సు ఘాట్ వద్ద రోడ్డు పక్కన నిద్రపోతున్న భక్తులపైకి దూసుకుపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ దుర్ఘటన అనంతరం బస్సు డ్రైవర్ బస్సును అక్కడే వదిలి పరారయ్యాడు. మృతదేహాలను పోస్టుమార్టం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
భక్తులపై బస్సు దూసుకెళ్లి ఏడుగురి మృతి