Encounter: మహారాష్ట్ర, తెలంగాణ ఎన్ కౌంటర్లలో 7 మంది మావోయిస్టులు మృతి

మావోయిస్టులపై మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. రెండు రాష్ట్రాల్లోనూ వేర్వేరు ప్రాంతాల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఇరువురి మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Last Updated : Oct 18, 2020, 11:15 PM IST
Encounter: మహారాష్ట్ర, తెలంగాణ ఎన్ కౌంటర్లలో 7 మంది మావోయిస్టులు మృతి

మావోయిస్టు ( Maoists ) లపై మహారాష్ట్ర ( Maharashtra ), తెలంగాణ ( Telangana ) పోలీసులు ఉక్కుపాదం మోపారు. రెండు రాష్ట్రాల్లోనూ వేర్వేరు ప్రాంతాల్లో భారీ ఎన్ కౌంటర్ ( Encounter ) జరిగింది. ఇరువురి మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.

ఇటీవలి కాలంలో మావోయిస్టుల దుశ్చర్యలపై భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ ( Combing operation ) జరిగింది. ఈ సందర్బంగా మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరగడంతో..ఏడుగురు మావోయిస్టులు మరణించారు. వీరిలో ముగ్గురు మహిళలలున్నారు. మహారాష్ట్ర్లలో జరిగిన ఎన్ కౌంటర్లో ఐదుగురు ( 5 Dead in Maharashtra Encounter ) మరణించగా..తెలంగాణ ఎన్ కౌంటర్లో ( 2 Dead in Telangana Encounter ) ఇద్దరు మృతి చెందారు.

మావోయిస్టు పార్టీ ( Maoist party ) తెలంగాణలో విధ్వంసం సృష్టించడానికి కొన్ని యాక్షన్ టీం ( Action teams ) లను, మావోయిస్టు దళాలను చత్తీస్‌గఢ్ ( Chattisgarh Borders ) రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలకు పంపించినట్లుగా సమాచారం అందింది. ప్రభుత్వ ఆస్తులను, పోలీసులపై దాడి చేయడానికి వ్యూహరచన చేసుకున్నట్లు సమాచారం లభించింది. దాంతో ఏటూరునాగారం, మంగపేట అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

మరోవైపు మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో ఉన్న కోస్మి - కిస్నేలి అటవీ ప్రాంతంలో సాయంత్రం 4 గంటల సమయంలో భారీ ఎన్ కౌంటర్ జరిగిందని గడ్చిరౌలి ఎస్పీ తెలిపారు. సీ - 60 కమాండోలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో..మావోయిస్టులు కాల్పులు జరిపారని..ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారని ఎస్పీ ప్రకటించారు. ఇటీవలి కాలంలో జరిగిన ఎన్ కౌంటర్లలో ఇదే పెద్దదిగా తెలుస్తోంది. 

ఇటీవల తెలంగాణ అధికార పార్టీ నేతల్ని మావోయిస్టులు లక్ష్యంగా ( Maoists targetted TRS leaders ) చేసుకున్నారు. అటు తెలంగాణ పోలీసుల్ని కూడా లక్ష్యంగా చేసుకుని మరిన్ని దాడులు చేయనున్నట్టు సమాచారం అందడంతో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ ను విస్తృతం చేశాయి. Also read: Corona End: 2021 ఫిబ్రవరి నాటికి ఇండియాలో కరోనా వైరస్ అంతం

Trending News