Big Shock To Maoist: మూడు నెలల్లో 1500 లొంగు బాటు.. మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ

Big Shock To Maoist: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మావోయిస్టులు లొంగుబాటు బాట పట్టారు.గత మూడు నెలల్లోనే ఏకంగా 15 వందల మందికి పైగా జన జీవన స్రవంతిలో కలిసిపోయారు.

Written by - Srisailam | Last Updated : Sep 18, 2022, 11:43 AM IST
Big Shock To Maoist: మూడు నెలల్లో 1500 లొంగు బాటు.. మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ

Big Shock To Maoist: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మావోయిస్టులు లొంగుబాటు బాట పట్టారు.గత మూడు నెలల్లోనే ఏకంగా 15 వందల మందికి పైగా జన జీవన స్రవంతిలో కలిసిపోయారు. శనివారం 700 మంది మావోయిస్టు సానుభూతిపరులు బీఎస్ఎఫ్  మల్కన్‌గిరి పోలీసుల ఎదుట లొంగిపోయారు. కోరాపుట్‌ డీఐజీ రాజేశ్‌ పండిట్‌, బీఎస్ ఎఫ్‌ డీఐజీ మదన్‌లాల్‌, మల్కన్‌గిరి ఎస్పీ నితేశ్‌ వద్వని, 65వ బెటాలియన్‌ సీవో టీఎస్‌ రెడ్డి సమక్షంలో మావోయిస్టులు లొంగిపోయారు.

జన జీవన స్రవంతిలో కలిసిపోయిన వారిలో 300 మంది మిలీషియా సభ్యులు ఉన్నారు. వీళ్లంతా సమీప గ్రామాల్లోని యువకులు. ఏపీలోని  అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగ్‌పుట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని పదల్‌పుట్‌, కుసుంపుట్‌, మటంపుట్‌, జోదిగుమ్మ గ్రామాల మిలీషియా సభ్యులు ఉన్నారు. ఒడిశా  మల్కన్‌గిరి జిల్లా భజగుడ, బైసెగుడ, ఖల్‌గుడ, పట్రపుట్‌, వందేపదర్‌, సంబల్‌పూర్‌, సింధిపుట్‌ గ్రామాలకు చెందిన మిలీషియా సభ్యులు ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారుల ముందు లొంగిపోయిన తర్వాత మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మావోయిస్టులు ఇచ్చిన డ్రెస్సులను దహనం చేశారు. ఏజెన్సీ అభివృద్ధికి మావోయిస్టులు అడ్డంకిగా మారుతున్నారని లొంగిపోయిన మిలీషియా సభ్యులు ఆరోపించారు. ఏవోబీ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై లొంగిపోయినట్లు చెప్పారు.

కొంత కాలంగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో పోలీసుల కూంబింగ్ ముమ్మరంగా సాగుతోంది. కూంబింగ్ చేయడంతో పాటు స్థానికుల్లో చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మావోయిస్టులతో పాటు మిలీషియా సభ్యులు లొంగిపోతున్నారు. గతనెల 22న 550 మంది లొంగిపోయారు.  జూన్‌ 11న 347 మంది ఉన్నతాధికారుల ముందు సరెండర్ అయ్యారు. ఇక  జూన్‌ 2న 50 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోయారు.

Also Read: Chandigarh University: 60 మంది విద్యార్థుల బాత్ రూం వీడియోలు లీక్.. పంజాబ్ యూనివర్శిటీలో దారుణం

Also Read: Punjab: చండీగఢ్ యూనివర్శిటీలో దారుణం..60 మంది విద్యార్థినుల బాత్ రూం వీడియోలు లీక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok

Trending News