8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గిఫ్ట్.. త్వరలో ఊహించని ప్రకటన..?

8th Pay Commission Latest News: 8వ వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయబోతుంది. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 16, 2023, 02:54 PM IST
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గిఫ్ట్.. త్వరలో ఊహించని ప్రకటన..?

Update on 8th Pay Commission : వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఏడాది రెండో డీఏ పెంపు ఉద్యోగులు ఎదురుచూస్తున్న తరుణంలో మరో అదిరిపోయే న్యూస్ తెరపైకి వచ్చింది. గతంలో 7వ వేతన సంఘం తర్వాత ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో కమిషన్‌ను ఏర్పాటు ఉండదని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మరో ఆలోచనట్లు తెలుస్తోంది. 

ఉద్యోగులకు తీపికబురు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిపుణులు అంటున్నారు. 7వ వేతన సంఘం తర్వాత 8వ వేతన సంఘంపై చర్చ ప్రారంభమైందని జీ బిజినెస్‌ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు 8వ వేతన సంఘం ఫైల్ కూడా సిద్ధమైందని తెలిపాయి. వచ్చే ఏడాది కేంద్ర ఉద్యోగుల కోసం ప్రభుత్వం భారీ ప్రకటన చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో పాటు ఉద్యోగుల బేసిక్ శాలరీ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇటీవల ప్రభుత్వ పెద్దల మధ్య జరిగిన చర్చల ఆధారంగా చూస్తే.. 7వ వేతన సంఘం తరువాత 8వ వేతన సంఘం రాదని అంతా భావించారు. కానీ.. తాజాగా 8వ వేతన సంఘం తీసుకువచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆలోపు ఉత్తర్వులు జారీ ఛాన్స్ ఉందని అంటున్నారు. 

Also Read: Earthquake In Delhi: భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు జనం పరుగులు

ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలలోపు నూతన పే కమిషన్‌కు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం. 8వ వేతన సంఘానికి సంబంధించి విధివిధానాలను కొత్త వేతన సంఘం ఛైర్మన్‌ రూపొందించనున్నారు. ఆయన నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి.. ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి అధ్యయనం చేస్తారు. ఎనిమిదో వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతాల్లో భారీగా పెరుగుదల ఉండనుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌కి సంబంధించి కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. ప్రతి పదేళ్లకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం కొత్త పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. 

Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News