7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు రానుంది. కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచే అవకాశం కనిపిస్తోంది. డియర్‌నెస్ అలవెన్స్‌ను ప్రభుత్వం 38 శాతం నుంచి 42 శాతానికి పెంచవచ్చు. ఫిక్స్‌డ్ ఫార్ములా కింద డీఏను 4 శాతం పెంచే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి ఓ ఫార్ములా కూడా కుదిరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పెన్షనర్లు, ఉద్యోగుల కోసం డీఏను ప్రతి నెల లేబర్ బ్యూరో జారీ చేసే పారిశ్రామిక కార్మికులకు సీపీఐ-ఐడబ్ల్యూ ఆధారంగా లెక్కిస్తారు. కార్మిక మంత్రిత్వ శాఖలో లేబర్ బ్యూరో ఒక భాగం అనే విషయం తెలిసిందే.
ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా మాట్లాడుతూ.. డిసెంబర్ 2022కి సంబంధించిన సీపీఐ-ఐడబ్ల్యూ జనవరి 31న విడుదలైందని చెప్పారు. డీఏ పెంపు 4.23 శాతంగా ఉందని చెప్పారు. అయితే ప్రభుత్వం దశాంశ బిందువు దాటి డీఏ పెంపునకు ఒప్పుకోదన్నారు. డీఏ నాలుగు శాతం పాయింట్లు పెరిగి 42 శాతానికి చేరుకునే అవకాశం ఉందన్నారు. డీఏ పెంచేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం ప్రతిపాదన చేస్తుందని తెలిపారు. ఈ ప్రతిపాదన ఆమోదం కోసం కేంద్ర మంత్రివర్గం ముందు ఉంచుతుందన్నారు. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా.. పెంపు జనవరి 1 నుంచి వర్తిస్తుంది.
డీఏను ఏడాదికి రెండుసార్లు పెంచుతున్న విషయం తెలిసిందే. జనవరి 1న, జూలై 1న డీఏ పెంపు ఉంటుంది. 7వ వేతన సంఘం ఉద్యోగుల కోసం హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ) మార్గదర్శకాలను కూడా ఇటీవలె ఆర్థిక మంత్రిత్వ శాఖ సవరించింది.
మరోవైపు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2.57 నుంచి 3.68 శాతానికి పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌కు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని గతంలో వర్గాలు పేర్కొన్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సవరించడం ముసాయిదాలో చర్చకు వస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రస్తుతం 2.57 శాతం ప్రకారం.. 18000 (18,000 X 2.57 = 46260) మూల వేతనంపై ఉద్యోగులు రూ.46,260 పొందుతున్నారు. 3.68 శాతానికి పెంచితే ఇతర అలవెన్సులు మినహాయిస్తే జీతం 26000X3.68 = రూ.95,680 అవుతుంది.
Also Read: IND Vs AUS: ఆసీస్-భారత్ టెస్ట్ సిరీస్.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి
Also Read: Pervez Musharraf: బిగ్ బ్రేకింగ్.. పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook