Maoists Encouter: రక్తంతో ఎరుపెక్కిన అడవి.. 8 మంది మావోయిస్టుల మృతి.. వారంలో రెండో ఘటన

Encounter Broke Out 8 Maoists Killed In Bijapur: దండకారణ్యంలో తుపాకీల మోత మోగింది. తుపాకీ గుళ్ల శబ్ధంతో అటవీ ప్రాంతం మార్మోగింది. ఫలితంగా రక్తంతో అడవి ఎరుపెక్కింది. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 2, 2024, 04:14 PM IST
Maoists Encouter: రక్తంతో ఎరుపెక్కిన అడవి.. 8 మంది మావోయిస్టుల మృతి.. వారంలో రెండో ఘటన

Naxals Encouter: మావోయిస్టులు.. పోలీసులు ఎదురుపడిన సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. అటవీ ప్రాంతంలో జరిగిన భీకర కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో సీనియర్‌ మావోయిస్టు నాయకుడు పాపారావు కూడా మృతిచెందారు. కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలోని పోర్చలి అటవీప్రాంతంలో జరిగింది.
Also Read: INDIA Bloc Rally: అరెస్ట్‌లపై ఇండియా కూటమి గర్జన.. ఓటుతో మోదీకి బుద్ధి చెప్పాలని పిలుపు

లెండ్రా గ్రామంలో పొర్చెలి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. వారిపై పోలీసులు కాల్పులకు యత్నించడంతో మావోయిస్టులు కూడా కాల్పులు జరిపారు. భద్రతా బలగాలకు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టులు చనిపోయారు. మరణించిన మావోయిస్టు మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనా స్థలం వద్ద మందుపాతరలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Punjab Girl Dies: ఘోర విషాదం.. పుట్టినరోజున కేక్ తిని చిన్నారి మృతి, ఫ్యామిలీ సీరియస్..

లెండ్రా గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాగి ఉన్నారని పక్కా సమాచారం తెలుసుకున్న డీఆర్‌జీ, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా కమాండ్‌ యూనిట్‌ బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. అటవీ ప్రాంతంలో గాలిస్తున్న మావోయిస్టులు తారసపడి ఈ దారుణానికి దారితీసింది. ఈ ప్రాంతంలో మరింత గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ తెలిపారు. మృతిచెందిన వారిలో సీనియర్‌ మావోయిస్టు పాపారావు ఉన్నారని వెల్లడించారు. అతడిపై రూ.40 లక్షల రివార్డు ఉందని వివరించారు.

మావోయిస్టులకు ఎదురుదెబ్బ
తాజా రెండు కాల్పులతో మావోయిస్టులకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. మార్చి 27వ తేదీన బీజాపూర్‌ జిల్లాలోనే జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. తాజాగా 8 మంది.. వారం వ్యవధిలో 12 మందిని కోల్పోవడం మావోయిస్టులపై భద్రతా బలగాలు పైచేయి సాధించాయి. మావోయిస్టులు ఇలా చిక్కడానికి పలు కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలకు అవాంతరం కలిగిస్తారనే ఉద్దేశంతో భద్రతా బలగాలు కూంబింగ్‌ చేపడుతున్నాయి. దీనికితోడు వేసవికాలం కావడంతో అటవీప్రాంతం మొత్తం ఎండిపోయి ఉంది. పచ్చదనం ఉంటే మావోయిస్టులు తప్పించుకునే అవకాశం ఉంది. పచ్చదనం తగ్గడంతో మావోయిస్టుల ఆచూకీ సులభంగా లభిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News