Rajasthan: కాస్సేపట్లో పెళ్లి..పెళ్లి కొడుకు సహా కుటుంబమంతా మృతి, ఏం జరిగింది

Rajasthan: మరి కాస్సేపట్లో పెళ్లి. ఆనందంతో కుటుంబసభ్యులతో వెళ్తున్నాడు. ఒక్కసారిగా ఊహించని ప్రమాదం. అంతే తోటి కుటుంబసభ్యులతో సహా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 20, 2022, 12:07 PM IST
  • రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం, నదిలో దూసుకుపోయిన కారు
  • వరుడు సహా 9 మంది ఒకే కుటుంబంలోని సభ్యులు మృతి
  • మరి కాస్సేపట్లో జరగనున్న పెళ్లికి వెళ్తుండగా..కోటా వద్ద జరిగిన ప్రమాదం
Rajasthan: కాస్సేపట్లో పెళ్లి..పెళ్లి కొడుకు సహా కుటుంబమంతా మృతి, ఏం జరిగింది

Rajasthan: మరి కాస్సేపట్లో పెళ్లి. ఆనందంతో కుటుంబసభ్యులతో వెళ్తున్నాడు. ఒక్కసారిగా ఊహించని ప్రమాదం. అంతే తోటి కుటుంబసభ్యులతో సహా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

అందరూ ఉలిక్కిపడే వార్త ఇది. మరి కాస్సేపట్లో వివాహ వేడుకలో ఆనందంగా గడపాల్సిన కుటుంబం. పెళ్లికి సిద్ధమైన వరుడు కుటుంబసభ్యులతో ఓ కారులో ప్రయాణమయ్యాడు. ఘోర రోడ్డు ప్రమాదంతో ఆనందమంతా ఆవిరైపోయింది. పెళ్లికి వెళ్తున్న కారు కోటా సమీపంలోని కల్వర్టు వద్ద ఒక్కసారిగా అదుపు తప్పింది. చంబల్ నదిలో దూసుకుపోయింది. వరుడు సహా కారులోని 9 మంది ప్రాణాలు గాలిలో కల్సిపోయాయి. కోటాలోని ఛోటీ పులియా నుంచి చంబల్ నదిలోకి కారు పడిపోయింది. 

సవాయి మాధోపూర్ నుంచి ఉజ్జయినికి ఇవాళ ఉదయం 5 గంటల 30 నిమిషాలకు బయలుదేరారు. కోటా సమీపంలోని నయాపురా కల్వర్టు వద్దకు రాగానే..కారు అదుపు తప్పి నదిలో పడిపోయింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో కారును నదిలోంచి బయటకు తీశారు. అప్పటికే కారులోని 9 మంది మృత్యువాత పడ్డారు. కారు డోర్స్, విండోస్ తెరిచేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదని సమాచారం. ఫలితంగా 9 మంది అక్కడికక్కడే మరణించారు. కారులో 7 మంది మృతదేహాలు లభ్యం కాగా, మరో ఇద్దరివి చేరువలోనే లభించాయి. మద్యం తాగి వాహనం నడుపుతుండటంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Also read: UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్‌లో నేడు మూడో విడత పోలింగ్.. 16 జిల్లాల్లోని 59 స్థానాలకు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News