మన ఓటు వజ్రాయుధం లాంటిది..మనం వేసే ఓటు నేతల తలరాతలను మార్చేస్తాయి.. మనం కోరుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలం.. ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు వినియోగించునే అవకాశం కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే. సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరిటీ ఓటు హక్కు కల్పించాల్సిందే మన రాజ్యాంగం చెబుతోంది.. ఈ బాధ్యత ను గుర్తెరిన ఎన్నిక సంఘం ఈనాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లోని ఓ గ్రామంలో ఉన్న ఒకే ఒక్క ఓటు కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సిబ్బందిని తరలిస్తోంది.
మారు మూల గ్రామంలో....
చైనా సరిహద్దు ప్రాంతమైన అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రం అంజా జిల్లా హయులియాంగ్‌లోని ఈ మారుమాల గ్రామం మలోగాంలో సోకెలా తయాంగ్ అనే మహిళా ఓటరు ఉన్నారు. ఇదే గ్రామంలో మరికొందరు ఓటర్లు ఉన్నా వారందరి ఓట్లు వేరే కేంద్రంలో ఉన్నాయి. దీంతో సోకెలా కోసమే ప్రత్యేకంగా ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
కాలినడక వెళ్లేందుకు సిబ్బంది రెడీ
ఇందుకోసం ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ అధికారి, భద్రతా సిబ్బంది, పోర్టర్లతో కూడిన బృందం సుమారు 40 కి.మీ దూరం వెళ్లాల్సి ఉంది . వాహనాల్లో వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో కాలి నడకన ఈ గ్రామానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై ఎన్నికల అధికారి లికెన్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో సోకెలాతో పాటు ఆమె భర్తకు ఇక్కడ ఓటు హక్కు ఉండేది. ప్రస్తుతం ఆమె భర్త ఓటు వేరే కేంద్రానికి మారిందని వివరించారు.
ఓటు హక్కును వినియోగించు కుందాం..
ఓటు హక్కు వినియోగించునే అవకాశం కల్పించే ప్రభుత బాధ్యత ఏపాటిదో తాజా వార్తతో అర్థమౌతోంది ..ఇదే సందర్భంలో మనం అందరం ఒక్క విషయాన్ని గుర్తించుకోవాలి.. ఓటు హక్కును వజ్రాయుధంలా వినియోగించుకోవడం మనందరి బాధ్యత...ఓటు హక్కును వినియోగించుకుందా..వినియోంచుకునేలా ప్రోత్సహిద్దాం... మన కోరుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం..