Aadhaar Card Address Update: ఆధార్ కార్డు లో అడ్రస్ అప్డేట్ అనేది చాలా సులభం. ఆధార్ కార్డులో అడ్రస్ అప్డేట్ అనేది ఆన్లైన్లో ఇంట్లో కూర్చుని లేదా ఆధార్ సెంటర్‌కు వెళ్లి చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇంట్లోనే ఉండి ఎక్కడికీ వెళ్లకుండా ఆధార్ అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ కార్డు అనేది అన్నింటికీ కావల్సిన ఆధారం. ఇటీవలి కాలంలో కీలకమైన డాక్యుమెంట్‌గా ఉపయోగపడుతోంది. ఇంటి అడ్రస్ మార్చాలనుకుంటే చాలా సులభంగా మార్చుకోవచ్చు. ఇళ్లు మారినప్పుుడు ఆధార్ కార్డు అడ్రస్ ఎప్పటికప్పుడు మార్చుకోకుంటే సమస్యలు ఎదురుకావచ్చు. ఆన్లైన్ విధానంలో ఆధార్ కార్డు అడ్రస్ సులభంగా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం.
ఆన్లైన్ ఆధార్ అప్డేట్ చేసే విధానం ఇలా
ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో మై ఆధార్ క్లిక్ చేయాలి. తరువాత అప్డేట్ అడ్రస్ క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. ప్రొసీడ్ టు అప్ డేట్ క్లిక్ చేయాలి. కొత్త అడ్రస్ ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. మీ అడ్రస్‌ను నిర్దారించే ప్రూఫ్ అప్లోడ్ చేయాలి. చివరిగా సబ్మిట్ క్లిక్ చేయాలి. ఆ తరువాత మీ అడ్రస్ అప్డేట్ చేసేందుకు యూఐడీఏఐ మీకొక ఓటీపీ పంపిస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేశాక వెరిఫై క్లిక్ చేయాలి. వారం రోజుల్లో మీ ఆధార్ కార్డు అడ్రస్ అప్డేట్ అయిపోతుంది.
ఆఫ్‌లైన్ అప్డేట్ ఇలా
ముందు సమీపంలోని ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్‌కు వెళ్లాలి. అక్కడొక ఫారం ఫిల్ చేయాలి. పాత అడ్రస్, కొత్త అడ్రస్ రెండూ సమర్పించాలి. కొత్త అడ్రస్ నిర్ధారించే డాక్యుమెంట్ సమర్పించాలి. నిర్ధారిత ఫీజు చెల్లించాలి. 15 రోజుల్లో ఆధార్ కార్డు అడ్రస్ అప్డేట్ అవుతుంది. అడ్రస్ అప్డేట్ చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్లు ఇలా ఉన్నాయి. ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ స్టేట్మెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్, టెలీఫోన్ బిల్, గ్యాస్ బిల్లలో ఏదైనా ఒకటి సమర్పించవచ్చు.
Also read: OPPO Smartphones: Oppo Find X7, Oppo Find X7 Ultra ఫీచర్లు, ధర ఇలా, లాంచ్ ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook