"ఆధార్" పదానికి ఆక్స్‌ఫర్డు డిక్షనరీలో చోటు

భారత ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న విశిష్ట గుర్తింపు సంఖ్యే "ఆధార్".

Last Updated : Jan 28, 2018, 09:55 AM IST
"ఆధార్" పదానికి ఆక్స్‌ఫర్డు డిక్షనరీలో చోటు

భారత ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న విశిష్ట గుర్తింపు సంఖ్యే "ఆధార్". ఈ  పదాన్ని ఇటీవలే తమ డిక్షనరీలో చేరుస్తున్నట్లు ఆక్స్‌‌ఫర్డు యూనివర్సిటీ ప్రెస్ వారి హిందీ విభాగం ప్రకటించింది. జైపుర్‌ సాహితీ ఉత్సవాల్లో అధికారికంగా ఈ ప్రకటనను విడుదల చేశారు. 2017కు సంవత్సరానికి గాను ఉత్తమమైన హిందీ పదంగా ‘ఆధార్‌’ను ఎంపిక చేసినట్లు ఈ సందర్భంగా ఆక్స్‌‌ఫర్డు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ‘నోట్‌బందీ’, ‘గౌ రక్షక్‌’ వంటి పదాలతో పోటీ పడి మరీ ‘ఆధార్‌’ పదం 2017 సంవత్సరానికి గాను ఆక్స్‌‌ఫర్డు డిక్షనరీలో దక్కించుకోవడం విశేషం. ఆధార్ కార్డుకు భారత ప్రజానీకంలో లభించిన ప్రాధాన్యత.. అది పాపులర్ అయిన విధానం, వచ్చిన విమర్శలు, ‘ఆధార్‌’ పదం విస్తృతంగా జనాల్లోకి చేరిన పద్ధతి మొదలైన అంశాలను అన్నింటిని పరిగణనలోకి తీసుకొని, నిఘంటువులో ఆ పదానికి స్థానం కల్పించినట్లు సమాచారం

Trending News