ఆరుషి కేసులో నిజనిజాలపై సుప్రీంకోర్టులో పిటీషన్..!

2008లో నోయిడాలో జరిగిన 13 ఏళ్ళ విద్యార్థిని ఆరుషి తల్వార్ హత్య కేసుకి సంబంధించి మరో వివాదం తెరమీదికి వచ్చింది.

Last Updated : Dec 16, 2017, 03:19 PM IST
ఆరుషి కేసులో నిజనిజాలపై సుప్రీంకోర్టులో పిటీషన్..!

2008లో నోయిడాలో జరిగిన 13 ఏళ్ళ విద్యార్థిని ఆరుషి తల్వార్ హత్య కేసుకి సంబంధించి మరో వివాదం తెరమీదికి వచ్చింది. కొన్ని నెలల క్రితం ఈ కేసులో నిర్దోషులుగా భావించి ఆరుషి తల్లిదండ్రులైన డాక్టర్ రాజేష్, నుపుర్ తల్వార్‌లను అలహాబాద్ హైకోర్టు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో ఆరుషి తల్లిదండ్రులు దోషులేనని, ఈ కేసుపై మరల దర్యాప్తుని చేపట్టాలని ఓ మహిళ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది.

ఆరుషి హత్యకేసులో తొలుత వారి ఇంట్లో పనిచేసే హేమరాజ్ అనే వ్యక్తిని పోలీసులు అనుమానించారు. అయితే రెండు రోజుల తర్వాత అదే వ్యక్తి శవంగా మారడంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది. ఆరుషి తల్లిదండ్రులను అనుమానితులుగా భావించి అరెస్టు చేశాక... ఇటీవలే హైకోర్టు వారికి క్లీన్ చిట్ ఇచ్చింది.ఈ క్రమంలో హేమరాజ్ భార్య తన భర్త హత్యతో పాటు.. ఆరుషి హత్యకు సంబంధించిన విషయంలో వాస్తవాలు బయటకు రావాలని కోరుతూ, తల్వార్ దంపతులే హంతకులని ఆరోపించారు. సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి పర్యవేక్షణలో హేమరాజ్ భార్య ఇటీవలే ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

Trending News