మళ్లీ విమానయానం షురూ..!!

రేపటి నుంచి మళ్లీ గగనయానం పునఃప్రారంభం కాబోతోంది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా నేలకే పరిమితమైన గగన విహంగాలు.. మళ్లీ రేపటి నుంచి నింగిలోకి ఎగరబోతున్నాయి.

Last Updated : May 24, 2020, 12:53 PM IST
మళ్లీ విమానయానం షురూ..!!

రేపటి నుంచి మళ్లీ గగనయానం పునఃప్రారంభం కాబోతోంది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా నేలకే పరిమితమైన గగన విహంగాలు.. మళ్లీ రేపటి నుంచి నింగిలోకి ఎగరబోతున్నాయి.

స్వదేశీ విమాన ప్రయాణం మాత్రమే ప్రస్తుతం పునః ప్రారంభం కానుంది. అంతర్జాతీయ విమాన ప్రయాణంపై మరికొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. రేపటి నుంచి ( మే 25 ) విమాన సర్వీసులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్ పోర్టులలో  ఏర్పాట్లు ఊపందుకున్నాయి. విమానాశ్రయాల్లో శానిటైజేషన్ చర్యలు చేపట్టారు. అంతే కాదు లాంజ్‌లలో ఉండే సీట్లలో సామాజిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు.  

దేశ రాజధాని ఢిల్లీ  ఎయిర్ పోర్టులోని టెర్మినల్ 3 నుంచి తొలి విమానం గాలిలోకి ఎగరనుంది. ఢిల్లీలో తెల్లవారుజామున 4.30 గంటలకు విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. తొలి దశలో ఢిల్లీ నుంచి 28 స్వదేశీ విమానాలు వివిధ దేశంలోని గమ్యస్థానాలకు ప్రయాణీకులను చేరవేస్తాయి. 

మరోవైపు  విమానాల్లో ప్రయాణించే ప్రయాణీకులకు పలు నిబంధనలు విధించింది ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ప్రయాణీకులు కచ్చితంగా 2 గంటల  ముందే విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంటుంది. తర్వాతి నాలుగు గంటల్లో  ప్రయాణించే వారిని మాత్రమే ఎయిర్  పోర్టులోకి అనుమతిస్తారు. విమాన  ప్రయాణీకులు తప్పనిసరిగా  గ్లౌజులు, మాస్కులు ధరించాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రయాణీకులు తప్పనిసరిగా 'ఆరోగ్యసేతు' యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఉపయోగిస్తూ ఉండాలి. ఐతే  14  ఏళ్ల లోపు వారికి దీనిపై సడలింపు ఇచ్చారు. ఒకవేళ ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోని వారు తప్పనిసరిగా..  తాము కరోనా బారిన పడలేదని సంతకం చేయాల్సి ఉంటుంది.

విమాన ప్రయాణీకులు స్క్రీనింగ్ జోన్ ద్వారానే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.  థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే టెర్మినల్ బిల్డింగ్‌లోకి అనుమతిస్తారు. ఎయిర్ పోర్టులో ప్రయాణీకులు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి.  ప్రత్యేకంగా అవసరైమన వారికి తప్ప అందరికీ లగేజీ ట్రాలీలు అందుబాటులో ఉండవు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News