మహాకూటమి నుంచే ప్రధాని అభ్యర్ధి - అఖిలేష్ యాదవ్

ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మరోసారి ప్రధాని అభ్యర్ధి ప్రస్తావన తీసుకొచ్చారు

Last Updated : Apr 19, 2019, 08:55 PM IST
మహాకూటమి నుంచే ప్రధాని అభ్యర్ధి - అఖిలేష్ యాదవ్

ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్  యాదవ్ మరోమారు ప్రధాని అభ్యర్ధి ప్రస్తావన తెచ్చారు. ఉత్తరప్రదేశ్ లోని మయిన్ పురిలో ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ అఖిలేష్ మాట్లాడుతూ నోట్ల రద్దు, జీఎస్టీతో సామాన్య జనాల పొట్టకొట్టిన మోడీ  ఈ సారి కచ్చితంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. 

దేశానికి కొత్త ప్రధాని కావాల్సిన ఆవశ్యకత ఉందని.... తదుపరి దేశ ప్రధాని అభ్యర్ధి ఎవరనే తమ మహాకూటమి నిర్ణయిస్తుందన్నారు. మహాకూటమి కూటమి అభ్యర్ధే ప్రధాని పీఠం ఎక్కుతారని వ్యాఖ్యానించారు. యూపీలో మహాకూటమిగా ఏర్పడి నిర్వహించిన ర్యాలీలో ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా పాల్గొన్నారు.

ప్రస్తుతం యూపీలో కాంగ్రెస్ ను పక్కన పెట్టి ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ  పార్టీలు మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. యూపీలోని 80 సీట్లలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెల్చుకొని కేంద్రంలో చక్రం తిప్పాలని ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ  మహాకూటమి భావిస్తోంది. ఈ నేపథ్యంలో అఖిలేష్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుంది.

Trending News