Quad Meet: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో ప్రధాని మోదీ భేటీ సెప్టెంబర్ 24న ఖరారు

Quad Meet: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ఖరారైంది. అమెరికా అధ్యక్షుడయ్యాక జో బిడెన్ ప్రధాని మోదీతో సమావేశం కావడం ఇదే తొలిసారి. అందుకే ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 21, 2021, 02:18 PM IST
  • సెప్టెంబర్ 24న ఖరారైన జో బిడెన్ ప్రధాని మోదీ భేటీ
  • వైట్‌హౌస్‌లో ఇరువురు నేతల మధ్య తొలిసారిగా ద్వైపాక్షిక చర్చలు
  • క్వాడ్ దేశాధినేతల సమావేశానికి అమెరికా వెళ్లనున్న ప్రధాని మోదీ
Quad Meet: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో ప్రధాని మోదీ భేటీ సెప్టెంబర్ 24న ఖరారు

Quad Meet: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ఖరారైంది. అమెరికా అధ్యక్షుడయ్యాక జో బిడెన్ ప్రధాని మోదీతో సమావేశం కావడం ఇదే తొలిసారి. అందుకే ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

చైనా (China)ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఏర్పడిన క్వాడ్ దేశాల భేటీ తొలిసారిగా జరగనుంది. సెప్టెంబర్ 24వ తేదీన వైట్‌హౌస్‌లో తొలిసారిగా జరగనున్న ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది. అదే రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మధ్య తొలిసారిగా ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. జో బిడెన్(Joe Biden)అమెరికా అధ్యక్షుడయ్యాక మోదీతో ఇదే తొలి సమావేశం కావడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశాన్ని యూఎస్ ప్రెసిడెంట్ కార్యక్రమాల షెడ్యూల్‌లో ఖరారు చేశారు. అటు ప్రధాని మోదీ కూడా 2019లో చివరిసారిగా అమెరికా సందర్శించారు. కరోనా సంక్షోభం అనంతరం ప్రధాని మోదీ చేపడుతున్న రెండవ విదేశీ పర్యటన ఇది. మార్చ్ నెలలో బంగ్లాదేశ్ సందర్శన తరువాత ఇప్పుడు క్వాడ్ దేశాల భేటీకు వెళ్లనున్నారు. 

క్వాడ్(Quad) దేశాధినేతల భేటీ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ(Pm Narendra Modi) జపాన్ ప్రధాని సుగాతో కూడా సమావేశం కానున్నారు. అటు జో బిడెన్ కూడా జపాన్ ప్రధానితో భేటీ అవనున్నారు. వైట్‌హౌస్‌లో జరిగే క్వాడ్ దేశాధినేతల సమావేశంలో బిడెన్, మోదీ, సుగా, స్కాట్ మారిసన్ పాల్గొననున్నారు. క్వాడ్ దేశాల వ్యాక్సిన్ కార్యక్రమంపై చర్చలు జరగనున్నాయి. మరీ ముఖ్యంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు, కొత్త టెక్నాలజీ వినియోగం, వాతావరణ మార్పు వంటి కీలక అంశాల్ని ప్రస్తావించనున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతలో శాంతి స్థాపనకై నేతలు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. అటు జో బిడెన్ కూడా తొలిసారి ఐక్యరాజ్యసమితి(UNO)లో ప్రసంగించనున్నారు. 

Also read: Auto Debit New Rules: ఆటోడెబిట్ ఇకపై అంత ఈజీ కాదు, అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News