Mysterious Loud Boom: కర్ణాటక రాజధాని, ఐటీ హబ్ బెంగళూరు (Bengaluru) మరోసారి భారీ వింత శబ్దంతో ఉలిక్కిపడింది. శుక్రవారం (నవంబర్ 26) మధ్యాహ్నం 12.15 గం. సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ శబ్దం (Mysterious Sound) వినిపించింది. దీంతో నగరవాసులు ఒకింత ఆందోళనకు, గందరగోళానికి గురయ్యారు. అసలేం జరిగిందంటూ పలువురు నెటిజన్లు ట్విట్టర్ పోస్టులతో ఆరా తీశారు.
మను అనే ఓ నెటిజన్.. 'ఇప్పుడే బెంగళూరులోని రాజరాజేశ్వరి నగరలో భారీ పేలుడు శబ్ధం వినిపించింది. తలుపులు, కిటికీలు ఊగిపోయాయి. ఇంకా ఎవరికైనా ఇలా అనిపించిందా..?' అని ట్విట్టర్‌లో ప్రశ్నించాడు. మరో నెటిజన్.. 'నాకొక్కడికేనా ఈ భారీ శబ్దం వినిపించింది... బెంగళూరు, ఆర్ఆర్ నగర్‌లో ప్రకంపనలు...' అని ట్వీట్ చేశాడు. ఇలా చాలామంది నెటిజన్లు తమకూ భారీ శబ్దం వినిపించినట్లు ట్వీట్లు చేశారు.
కర్ణాటకలోని (Karnataka) మండ్య, రామనగర జిల్లాల్లోనూ ఈ శబ్ధం వినిపించినట్లు చెప్తున్నారు. ఇది భూకంపం వల్ల సంభవించిన శబ్ధమా లేక సూపర్ సోనిక్ బూమా? (Supersonic Boom) అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భూప్రకంపనలు కావొచ్చునేమో అన్న ప్రచారాన్ని ప్రకృతి విపత్తుల విభాగం తోసిపుచ్చింది. ' హెమ్మిగెపురా, కెంగెరి, జ్ఞానభారతి, రాజరాజేశ్వరి నగర్, కగ్గలిపురా, బెంగళూరులో ఇవాళ 11.50 గం. నుంచి 12.15 గం. సమయంలో భారీ శబ్దంతో పాటు స్వల్ప ప్రకంపనలు వచ్చినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. ఆ డేటాను మేము సెసిమిక్ అబ్జర్వేటరీలతో విశ్లేషించగా.. ఎటువంటి భూకంప (Earthquake) సంకేతాలు కనిపించలేదు.' అని కర్ణాటక రాష్ట్ర ప్రకృతి విపత్తు పర్యవేక్షణ కేంద్రం వెల్లడించింది. దీంతో ఈ మిస్టరీ సౌండ్‌కు కారణమేంటన్నది అంతుచిక్కట్లేదు.
Just now heard a loud explosion sound in Bengaluru, then doors and windows vibrated. I felt this in Rajarajeshwari Nagara. #Bengaluru #Bangalore #SonicBoom? Others felt too??
— Manu (@BangaloreanBruh) November 26, 2021
Also Read:అరంగేట్రంలోనే సెంచరీతో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్!
బెంగళూరు ఇలాంటి భారీ వింత శబ్ధాలు (Mysterious Loud Noise) మొదటిసారేమీ కాదు. గతేడాది మే నెలలో ఇలాంటిదే భారీ శబ్ధం వినిపించగా నగరవాసులు ఉలిక్కిపడ్డారు. అయితే యుద్ధ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఈ శబ్ధం వచ్చినట్లు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్పష్టం చేసింది. ఈ ఏడాది జులైలోనూ నగరంలో భారీ శబ్దం వినిపించగా... తమవైపు నుంచి ఎటువంటి అసాధారణ కార్యకలాపాలు జరగలేదని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వెల్లడించింది. దీంతో ఆ సౌండ్ ఏంటనేది మిస్టరీగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook