Kerala: రాజధాని మేయర్‌గా డిగ్రీ విద్యార్ధిని..దేశంలో సరికొత్త రికార్డు

Kerala: డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని ఓ రాష్ట్ర రాజధాని నగరానికి మేయర్ అంటే నమ్ముతారా..అలాగని ఆమెకే రాజకీయ వారసత్వం లేదు. ఇంకా ఆశ్చర్యంగా ఉందా..నిజమే..అదే జరిగింది..

Last Updated : Dec 26, 2020, 10:09 AM IST
  • దేశంలోనే అతి చిన్న వయస్సులో మేయర్ పదవి దక్కించుకున్న రికార్డు
  • కేరళ రాజధాని తిరువనంతపురం మేయర్ గా డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్ధిని ఆర్య రాజేంద్రన్
  • 21 ఏళ్ల ఆర్య రాజేంద్రన్..ఓ దిగువ మధ్య తరగతి అమ్మాయి
Kerala: రాజధాని మేయర్‌గా డిగ్రీ విద్యార్ధిని..దేశంలో సరికొత్త రికార్డు

Kerala: డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని ఓ రాష్ట్ర రాజధాని నగరానికి మేయర్ అంటే నమ్ముతారా..అలాగని ఆమెకే రాజకీయ వారసత్వం లేదు. ఇంకా ఆశ్చర్యంగా ఉందా..నిజమే..అదే జరిగింది..

విద్య, రాజకీయ, సామాజిక అంశాల్లో  బాగా చైతన్యం కలిగిన రాష్ట్రం కేరళ ( Kerala ). అందుకే ఈ రాష్ట్రంలో అంశాలు కూడా ఆసక్తి కల్గిస్తుంటాయి. దేశంలోనే అత్యంత చిన్న వయస్సులోనే మేయర్ పదవిని చేపట్టనుంది ఓ విద్యార్ధిని. అది కూడా రాష్ట్ర రాజధాని నగరమైన తిరువనంతపురం మేయర్‌ ( Mayor )గా. అలాగని ఆమెకు రాజకీయ వారసత్వమో..లేదా ఆర్ధిక దన్ను ఉందనుకుంటే పొరపాటే. అటువంటివేమీ లేవు. ఓ సాధారణ దిగువ మధ్య తరగతి అమ్మాయి. 

తిరువనంతపురం ( Thiruvananthapuram ) అల్ సెయింట్స్ కాలేజ్‌లో బీఎస్సీ మేథమెటిక్స్ రెండో ఏడాది చదువుతున్న 21 ఏళ్ల ఆర్య రాజేంద్రన్ (Arya Rajendran ) ఇప్పుడు తిరువనంతపురం మేయర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సీపీఎం విద్యార్ధి విభాగమైన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా చురుగ్గా ఉండే ఆర్య రాజేంద్రన్..పార్టీ చిన్నారుల విభాగమైన బాలసంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో తిరువనంతపురంలోని ముడవన్‌ముగళ్‌ వార్డు కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచారు. 

తిరువనంతపురం ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ( LDF ) మెజార్టీ స్థానాలు గెల్చుకున్నా..మేయర్ అభ్యర్ధులుగా బరిలో దిగిన ఇద్దరు సీపీఎం నేతలు ఓడిపోయారు. దాంతో జిల్లా నాయకత్వం ఆర్య రాజేంద్రన్ పేరును ప్రతిపాదించగా..రాష్ట్ర నాయకత్వం అంగీకరించింది. దాంతో ఆర్య రాజేంద్రన్ మేయర్ పదవి చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. పార్టీ అప్పగించిన బాధ్యతను ఆనందంగా స్వీకరిస్తానని ఆర్య రాజేంద్రన్ అంటున్నారు.  ప్రజాసేవ చేస్తూనే..చదువు కొనసాగిస్తానంటున్నారు. ఆర్య రాజేంద్రన్ తండ్రి ఓ ఎలక్ట్రీషియన్ కాగా..తల్లి ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేస్తున్నారు. 

దేశంలోనే అత్యంత చిన్న వయస్సులో మేయర్  కాబోతున్న ఖ్యాతి దక్కించుకున్నారు. ఇప్పటివరకూ ఈ రికార్డు తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలోని  మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా జవహర్ నగర్ మేయర్‌గా ఉన్న 26 ఏళ్ల కావ్య పేరిట ఉంది. ఇప్పుడీ రికార్డును కేరళ విద్యార్ధిని రాజేంద్రన్ చేజిక్కించుకోబోతోంది.

Also read: Maharashtra: ధారావిలో తొలిసారిగా జీరో కేసులు

Trending News