CM Himanta Biswa sarma: బంపర్ ఆఫర్.. 74 ఏళ్ల ఎంపీని మరో పెళ్లి చేసుకోమన్న సీఎం.. కానీ ఆ తర్వాత..

Common Civil Code: దేశంలో కామన్ సివిల్ కోడ్ విధానం తొందరలోనే అమల్లోకి రానుందని అస్సాం సీఎం హిమంట్ బిశ్వశర్మ అన్నారు. ఈ క్రమంలో  ఎన్నికలలోపు ధుబ్రి ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ ను మరోపెళ్లి చేసుకోమ్మని ఆఫర్ ఇచ్చారు. ఎన్నికల తర్వాత దేశంలో అనేక రకాల మార్పులు ఉంటాయని ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 31, 2024, 12:53 PM IST
  • ఎన్నికల తర్వాత కీలక మార్పులుంటాయన్న సీఎం..
  • బహువివాహాలు ఇక చెల్లవని క్లారిటీ..
CM Himanta Biswa sarma: బంపర్ ఆఫర్.. 74 ఏళ్ల ఎంపీని మరో పెళ్లి చేసుకోమన్న సీఎం.. కానీ ఆ తర్వాత..

Assam CM Himanta Biswa sarma Comments On MP Badruddin Ajmal: దేశంలో ప్రస్తుతం ఎన్నికల హీట్ కొనసాగుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హ్యాట్రిక్ కొట్టే దిశగా ప్రచారం నిర్వహిస్తుంది. ఇక కాంగ్రెస్ కూడా తమ దైన స్టైల్ లో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటనతో నాలుగు రాష్ట్రాలు, లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేశంలో కామన్ సివిల్ కోడ్ విధానం తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. దీన్ని కొందరు ఆహ్వానిస్తుండగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ప్రస్తుతం అస్సాం సీఎం హిమంత్ బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి. ముఖ్యంగా కామన్ సివిల్ కోడ్ వివాదం ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తోంది.

Read More: Teen Girl reel At Airport: ఎయిర్ పోర్టులో యువతి రచ్చ.. లగేజీ ట్రాలీపై పడుకొని రీల్స్.. వైరల్ గా మారిన వీడియో..

వివాహం, విడాకులు, నిర్వహణ, వారసత్వం, దత్తత,  వారసత్వం వంటివి జాతీయ సివిల్ కోడ్ ప్రకారం సమాజంలోని అన్ని వర్గాల వారు సమానంగా పరిగణించబడతారని UCC సూచిస్తుంది.ఈ నేపథ్యంలో.. అస్సాం సీఎం హిమంత్ బిశ్వశర్మ మాట్లాడుతూ..ఏఐయూడీఎఫ్‌కు చెందిన ధుబ్రి ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఎన్నికలకు ముందే పెళ్లి చేసుకోవాలని, ఆ తర్వాత యూనిఫాం సివిల్ కోడ్ అమలులోకి వచ్చి జైలుకెళ్లడం ఖాయమని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శనివారం అన్నారు. అదే విధంగా.. అజ్మల్ తన పెళ్లికి ఆహ్వానిస్తే, "నేను కూడా హాజరవుతానని పేర్కొన్నారు.

కానీ ఎన్నికల  తర్వాత మాత్రం ఇలాంటివి ఉండవు. దేశంలో కామన్ సివిల్ కోడ్ అమల్లోకి వస్తుంది. ఈ చట్టం అన్నివర్గాలకు ఒకేలా వర్తిస్తుంది. ఆ తర్వాత మాత్రం ఇలాంటి పనులు చేయడానికి అవకశం ఉండదంటూ సెటైర్ లు వేశారు. కాగా, ఇటీవల ధుమ్రి ఎంపీ మాట్లాడుతూ.. ముస్లింలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, తాను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటే తన మతం అనుమతించినందున తనను ఎవరూ అడ్డుకోలేరని అజ్మల్ ఇటీవల అన్నారు.

Read More: Snake Attack: పాముతో లిప్ లాక్ కోసం ట్రైచేశాడు.. ట్విస్ట్ మాములుగా లేదుగా..అసలేం జరిగిందంటే..?

దీనికి కౌంటర్ గానే ఆయన పైవిధంగా స్పందించినట్లు తెలుస్తోంది. యూసీసీ ప్రకారం.. అనేక మందిని పెళ్లిళ్లు చేసుకొవడం చట్టప్రకారం నేరం. ఒక వేళ చేసుకుంటే జైలు ఉండాల్సి ఉంటుందంటూ హిమంత్ బిశ్వశర్మ  ఉదల్గురిలో జరిగిన ఎన్నికల సమావేశంలో శర్మ అన్నారు.అస్సాం రాష్ట్రంలో బాల్య వివాహాల ముప్పును అంతం చేయడానికి, యుసిసి అమలుకు ఒక అడుగుగా అస్సాం ముస్లిం వివాహాలు,  విడాకుల నమోదు చట్టం, 1935 ను రద్దు చేయాలనే నిర్ణయాన్ని అస్సాం క్యాబినెట్ గత నెలలో ఆమోదించిన విషయం తెలిసిందే. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News