కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఈ నెల 15వ తేదిన వెలువడుతున్న క్రమంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెరమీదికొస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రముఖ పత్రికలు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హంగ్ వచ్చే పరిస్థితి ఉందని.. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పడడంలో జేడీఎస్ ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపాయి. అయితే ఇదే క్రమంలో జేడీఎస్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలంటే.. వారు దళితుడికి సీఎం పీఠం కట్టబెట్టాల్సి ఉంటుందని అడిగే అవకాశం లేకపోలేదని కూడా పలువురు అంటున్నారు.
ఈ సంగతిని పక్కన పెడితే, కాంగ్రెస్ మాత్రం పరిస్థితి ఎలా ఉన్నా.. ఒకవేళ గెలిస్తే సిద్ధరామయ్యకే సీఎం పీఠం కట్టబెట్టడానికి శాయశక్తులా ప్రయత్నించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే గత 40 సంవత్సరాల కర్ణాటక పాలిటిక్స్‌ను పరిశీలిస్తే.. 5 సంవత్సరాలు సీఎంగా ఉండి రాజ్యమేలిన సిద్ధరామయ్యకి మాత్రమే దక్కిందనడంలో సందేహం లేదు.
సిద్ధరామయ్య కూడా ఇటీవలి కాలంలో దళిత సీఎంను ఎంపిక చేస్తామంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. అయితే బీజేపీ కూడా గెలుపు తమవైపే ఉందని దీమాగా చెబుతోంది. దాదాపు 130 సీట్లు గెలుచుకుంటామని ఎడ్యూరప్ప వర్గం అంటోంది. చాణక్య, టైమ్స్ నవ్ లాంటి వారి అంచనాల ప్రకారం ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకే మెజారిటీ వస్తుందని ప్రకటించగా.. ఇండియా టుడే వారి ఎగ్జి్ట్ పోల్స్‌లో కాంగ్రెస్‌కే పట్టం కట్టారు.
ఇక ఏ పార్టీ భవితవ్యం ఎలా ఉందో తెలుసుకోవాలంటే మాత్రం రేపటి వరకు వేచి చూడాల్సిందే. మొత్తానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై కూడా కచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉందని రాజకీయా విశ్లేషకులు అంటున్నారు.