Mamata Comments: బీజేపీ పాలన హిట్లర్‌ను తలపిస్తోంది.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు..!

Mamata Comments: కేంద్ర ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి నిప్పులు చెరిగారు.  గతకొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న ఆమె తాజాగా బీజేపీ పార్టీ పెద్దలను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 23, 2022, 09:08 PM IST
  • కేంద్రంపై మమతా బెనర్జీ నిప్పులు
  • ఇదేమి సమాఖ్య విధానమని విమర్శలు
  • దర్యాప్తు సంస్థల పనితీరు మారాలన్న మమత
Mamata Comments: బీజేపీ పాలన హిట్లర్‌ను తలపిస్తోంది.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు..!

Mamata Comments: కేంద్ర ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి నిప్పులు చెరిగారు.  గతకొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న ఆమె తాజాగా బీజేపీ పార్టీ పెద్దలను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. దేశంలో సమాఖ్య నిర్మాణానికి తూట్లు పెడుతున్నారని విమర్శించారు. 

కోల్‌కతాలో మీడియాతో మాట్లాడిన తృణమూల్ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ..మోదీ సర్కార్‌పై ఫైర్ అయ్యారు. కేంద్రంలో బీజేపీ పాలన హిట్లర్, స్టాలిన్, ముస్సోలిన్‌ కన్నా దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా నడుకునేలా చూడాలని చెప్పారు మమతా బెనర్జీ.

కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌యేతర కూటమే లక్ష్యంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పావులు కదుపుతున్నారు. ఇటీవల విపక్ష నేతలతో సమావేశమైయ్యారు. దేశ రాజకీయాలపై చర్చించారు. ప్రత్యామ్నాయ కూటమితోనే దేశంలో అభివృద్ధి జరుగుతుందని పలు సందర్భాల్లో ఆమె వ్యాఖ్యలు చేశారు. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్ మూడో కూటమి దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. త్వరలో మమతా బెనర్జీ సైతం పలువురు విపక్ష నేతలతో మారోమారు భేటీ అవుతారని తెలుస్తోంది. 

 

Also read:CM Jagan Tour: టెక్‌ మహీంద్రా సీఈవో గుర్నానితో సీఎం జగన్ భేటీ..కీలక అంశాలపై చర్చ..!

Also read:Four in Single Birth: ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ... ఎక్కడంటే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News