Flash: బేణి ప్రసాద్ వర్మ ఇక లేరు

కేంద్ర మాజీ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు బేణీ ప్రసాద్ వర్మ (79) ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం లక్నోలో తుది శ్వాస విడిచారు. 

Last Updated : Mar 28, 2020, 01:10 AM IST
Flash: బేణి ప్రసాద్ వర్మ ఇక లేరు

లక్నో: కేంద్ర మాజీ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు బేణీ ప్రసాద్ వర్మ (79) ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం లక్నోలో తుది శ్వాస విడిచారు. వర్మ స్వస్థలమైన ఉత్తర్ ప్రదేశ్ బారాబంకీ జిల్లాలోని సిరౌలీలో శనివారం ఆయన పార్థివదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. బేణీ ప్రసాద్ వర్మ మృతిపై సమాజ్ వాదీ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. పార్టీలో సీనియర్ నాయకుడైన బేణీ ప్రసాద్ మరణం పార్టీని షాక్‌కి గురిచేసింది. ఆయన లేని లోటు పూడ్చలేనిది ఆ పార్టీ ఓ సంతాప ప్రకటన విడుదల చేసింది. 

బేణీప్రసాద్ రాజకీయ వర్మ ప్రస్థానం..
ఉత్తర్ ప్రదేశ్‌లోని కుర్మి కులంలో పెద్ద నాయకుడిగా ఎదిగిన బేణీ ప్రసాద్ వర్మ సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్‌కి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ సర్కారులో ఎక్కువ కాలం పాటు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ శాఖ మంత్రిగానూ సేవలందించారు. 1941, ఫిబ్రవరి 11న సిరౌలిలో జన్మించిన బేణీప్రసాద్ వర్మ.. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. 1996 నుండి 2014 వరకు లోక్ సభ సభ్యుడిగా ఉన్న వర్మ.. దేవే గౌడ, ఐకే గుజ్రాల్ కేబినెట్స్‌లో మంత్రిగా పనిచేశారు. 

Read also : COVID-19 in Telangana: తెలంగాణలో మరో 10 కరోనా పాజిటివ్ కేసులు

2009లో కాంగ్రెస్ పార్టీలో చేరిన బేణీప్రసాద్ వర్మ ఉత్తర్ ప్రదేశ్‌లోని గోండా లోక్ సభ నియోజకవర్గం నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు. అప్పటి మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో ఉక్కు శాఖ మంత్రిగా బేణీప్రసాద్ వర్మ సేవలు అందించారు. ఆ తర్వాత ఏడేళ్లకు 2016లో తిరిగి సమాజ్ వాదీ పార్టీ గూటికే వచ్చిన బేణీప్రసాద్ వర్మ ఆ తర్వాత అదే పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 

Read also : ఆ 2 ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌ని వాయిదా వేసిన కేంద్రం

2017లో సమాజ్ వాదీ పార్టీ పగ్గాలు అఖిలేష్ యాదవ్ చేతుల్లోకి వెళ్లిన అనంతరం బేణీప్రసాద్ వర్మ పార్టీలో అంత క్రియాశీలక పాత్ర పోషించనప్పటికీ... సమయం, సందర్భం వచ్చిన ప్రతీసారి ఆ పార్టీకి చెందిన పెద్ద నాయకుల్లో ఆయన పేరే ప్రముఖంగా వినిపిస్తూ వచ్చేది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News