Varavara Rao: విరసన నేత, సామాజిక ఉద్యమకారుడు వరవరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్ర బీమా కోరేగావ్ కుట్ర కేసులో ఆయనకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వైద్య పరమైన కారణాలతో వరవరరావుకు బెయిల్ ఇచ్చిన ధర్మాసనం. గ్రేటర్ ముంబై విడిచి ఎక్కడికి వెళ్లరాదని కండీషన్ పెట్టింది. ఆరోగ్యానికి సంబంధించి వివరాలను ఎన్ఐఏకి అందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని, కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా ప్రయత్నించవద్దని దేశ అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది.
మహారాష్ట్రలో సంచలనం రేపిన భీమా కోరేగావ్ కేసులో 2018లో వరవరరావును ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. కరోనా సమయంలో బెయిల్ కోసం పలుమార్లు బాంబే హైకోర్టును ఆశ్రయించి.. ఆరోగ్య కారణాలతో బెయిల్ పొందారు. వరవరరావుకు ప్రస్తుతం 82 సంవత్సరాలు. ఆయన ప్రస్తుతం పార్కిన్సన్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. .దీంతో తన వయసు, ఆరోగ్య కారణాలతో శాశ్వత బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత జులై 19న ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆగస్ట్ 10కి వాయిదా వేసింది. ఇవాళ ఈ పిటిషన్ పై ధర్మాసనం విచారణ జరిగింది. ఆరోగ్య కారణాల రీత్యా వరవరరావుకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సూర్యకాంత్, జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.
200 ఏళ్ల కింద జరిగిన బీమా కోరేగావ్ యుద్ధాన్ని స్మరించుకునేందుకు ఎల్గర్ పరిషత్తు అనే సంస్థ 2017 డిసెంబర్ లో ఓ కార్యక్రమం నిర్వహించింది. అది మహారాష్ట్రంలో అల్లర్లకు కారణమైంది. బీమా కోరేగావ్‌లో 2018 జనవరిలో అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్ల వెనుక మావోయిస్టుల కుట్ర ఉందని పుణెలో పోలీసులు కేసు నమోదు చేశారు. బీమా కోరేగావ్ సభకు మావోయిస్టులు హాజరయ్యారని... వాళ్ల ప్రసంగాలే బీమా కోరేగావ్ అల్లర్లకు కారణమయ్యాయని పోలీసులు ఎప్ఐఆర్ లో నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి 2018 జూన్‌లో దేశవ్యాప్తంగా ఆరుగుర్ని అరెస్టు చేశారు. ఇందులో తెలంగాణకు చెందిన వరవరరావుతో పాటు ఢిల్లీ పౌరహక్కుల నేతలు రోనా విల్సన్, రోనా జాకొబ్, దళిత హక్కుల నాయకుడు ఎల్గార్ పరిషత్ నేత సుధీర్ ధవాలె, షోమ సేన్, మహేష్ రౌత్, న్యాయవాది సరేంద్ర గాడ్లింగ్ ఉన్నారు.
Read Also: Rythu Bima: తెలంగాణ రైతులకు శుభవార్త..రైతు బీమా నమోదు గడువు పెంపు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook