ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు రూ.47,500 జరిమానా

ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు రూ.47,500 జరిమానా

Last Updated : Sep 5, 2019, 10:27 AM IST
ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు రూ.47,500 జరిమానా

భువనేశ్వర్: మోటార్ వాహన చట్టం 2019 వాహనదారులను వణికిస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి మోటారు వాహన చట్టం అమలులోకొచ్చిన తర్వాత ఈ నాలుగు రోజులుగా దేశం నలుమూలల నుంచి రోజూ ఏదో ఓ చోట వాహనదారులకు పట్టపగలే చుక్కలు చూపించే విధంగా భారీ జరిమానాలు పడుతూనే ఉన్నాయి. తాజాగా బుధవారం నాడు భువనేశ్వర్‌లోని ఓ ఆటో వాలా నెత్తిన కూడా ఈ ట్రాఫిక్ చట్టం పిడుగుపడింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఆటో నడిపిన నేరం కింద హరిబంధు కన్హర్ అనే ఆటోవాలాకు భువనేశ్వర్ ట్రాఫిక్ పోలీసులు రూ. 47,500 జరిమానా విధించారు. 

మద్యం సేవించి వాహనం నడిపినందుకు రూ.10,000, ధ్వని కాలుష్యానికి కారణమైనందుకు రూ. 10,000, పర్మిషన్ షరతులకు లోబడి నడుచుకోనందుకు రూ.10,000, ఇన్‌వ్యాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నందుకు రూ.5,000, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లు లేనందుకు మరో రూ.5000, ఇతర ఉల్లంఘనల కింద రూ. 5500, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడుపుతున్నందుకు రూ.2,000 జరిమానా విధించటంతో మొత్తం జరిమానా రూ.47,500కు చేరింది. 

బతుకుదెరువు కోసమే ఇటీవల ఆటో కొనుక్కుంటే, పోలీసులు భారీ జరిమానా విధించారని, ఆ జరిమానా చెల్లించేంత డబ్బు తన వద్ద లేదని ఆటో డ్రైవర్ వాపోయాడు.

Trending News