New Visa Rules: భారతీయ విద్యార్ధుల అమెరికా వీసా నిబందనల్లో మార్పులు, ఇవాళ్టి నుంచే అమలు

New Visa Rules: అగ్రరాజ్యం అమెరికా వెళ్లే విద్యార్దులకు ముఖ్య గమనిక. యూఎస్ ఎంబసీ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఈ నిబందనలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చేశాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 27, 2023, 10:42 PM IST
New Visa Rules: భారతీయ విద్యార్ధుల అమెరికా వీసా నిబందనల్లో మార్పులు, ఇవాళ్టి నుంచే అమలు

New Visa Rules: భారతీయ విద్యార్ధులకు బిగ్ అలర్ట్. ముఖ్యంగా అమెరికా వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్ధులు గమనించాల్సిన విషయమిది. అమెరికా రాయబార కార్యాలయం కొన్ని సవరణలు చేసింది. కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. భారతీయ విద్యార్ధులకు వీసా దరఖాస్తు ప్రక్రియలో తీసుకొచ్చిన కొత్త నిబంధనలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. 

ప్రతి యేటా లక్షలాదిమంది విద్యార్ధులు విద్య కోసం అమెరికాకు పయనమౌతుంటారు. అందులో అత్యధికులు భారతీయులే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకే అమెరికన్ ఎంబసీ భారతీయ విద్యార్ధుల వీసా దరఖాస్తు ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త మార్పుల్ని ఇవాళ్టి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. యూఎస్ రాయబార కార్యాలయం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు ఇండియాలోని అన్ని రాయబార కార్యాలయాలకు వర్తించనున్నాయి. ఎఫ్, ఎమ్, జే వీసా ప్రోగ్రామ్స్ కింద అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్దులు ఈ మార్పుల్ని గమనించాల్సి ఉంటుంది. ప్రొఫైల్ క్రియేషన్, వీసా అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసేటప్పుడు పాస్‌పోర్ట్‌లో ఉన్న సమాచారాన్నే వినియోగించాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ నెంబర్ తప్పైతే దరఖాస్తుల్ని అక్కడికక్కడే తిరస్కరిస్తారు. అపాయింట్‌మెంట్లు రద్దయిపోతాయి. వీసా రుసుము కూడా రద్దవుతుంది.

ఎఫ్, ఎమ్ వీసాలకై దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు తప్పనిసరిగా స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ ధృవీకరించిన స్కూల్ లేదా ప్రోగ్రామ్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. జే వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు అమెరికా విదేశాంగ శాఖ అనుమతి ఉన్న స్పాన్సర్‌షిప్ అవసరమౌతుంది. ఒకవేళ తప్పుడు పాస్‌పోర్ట్ నెంబర్‌తో ప్రొఫైల్ క్రియేట్ చేసుంటే సరైన నెంబరుతో కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఆపాయింట్‌మెంట్ కోసం మళ్లీ బుక్ చేసుకోవాలి. వీసా ఫీజు మరోసారి చెల్లించాల్సి ఉంటుంది. ఇక పాత పాస్‌పోర్ట్ పోయినా లేదా చోరీకు గురైన కొత్త పాస్‌పోర్ట్ తీసుకున్నవాళ్లు, కొత్త పాస్‌పోర్ట్ కోసం రెన్యువల్ చేయించుకున్నవాళ్లు పాత పాస్‌పోర్ట్ కాపీ జత చేయాలి. 

Also read: Indian Wedding: విదేశీ పెళ్లిళ్లు వద్దు.. స్వదేశీ పెళ్లిళ్లు ముద్దు అంటున్న మోడీ.. వరుణ్ తేజ్ పెళ్లిని ఉద్దేశించేనా..!?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News