Bihar Live Updates: బిహార్ రాజకీయాలు ప్రస్తుతం దేశంలో హట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు. ఎన్టీయే కూటమిని గద్దెదించడమే టార్గెట్ గా ప్రతిపక్ష పార్టీలన్ని కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. బిహార్ జేడీయూ నేత మరోసారి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇండియా కూటమిలో ఇమడలేకనే తిరిగి ఆయన యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కలిసి బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు ఆయన తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అదే విధంగా ఇప్పటికే నీతీష్ కుమార్ ఆర్జేడీతో సంపూర్ణంగా బంధాన్ని తెంచుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ, నీతిష్ కుమార్ కు కాల్ చేసిన ఆయన స్పందించలేదని సమాచారం.
Read Also: Wedding: ''భర్తలతో విడిపోయిన భార్యలకు గుడ్ న్యూస్..'' కీలక తీర్పు వెలువరించిన హైకోర్టు..
ఈ క్రమంలోనే ఆయన రాజీనామా తర్వాత.. తిరిగి బీజేపీతో కలిసి సాయంత్రం మరల బీజేపీతో కలిసి తిరిగి మహాఘట్ బంధన్ తో ప్రభుత్వాం ఏర్పాటు దిశగా వెళ్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా... ఇప్పటికే జేడీయూ నేతల పట్నాలోని ప్రధాన కార్యాలయంకు చేరుకుంటున్నారు.
మరికొన్ని రోజుల్లో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం దేశ రాజకీయాల్లో మరింత హీట్ ను పెంచిందని చెప్పుకొవచ్చు. మరోవైపు.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు మరికొందరు బీజేపీ నేతలు కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక చార్టర్ విమానంలో పాట్నా చేరుకోనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook