Four bodies recovered and Three injured persons rescued from Bipin Rawat Helicopter Crash: కొద్ధిసేపటి క్రితం తమిళనాడు రాష్ట్రంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం (Helicopter Crash) చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భారత త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ (Bipin Rawat) ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూనూరు సమీపంలో కుప్పకూలింది. హెలికాప్టర్‌లో బిపిన్ రావత్, ఆయన కుటుంబ సభ్యులు మరియు సిబ్బందితో సహా మొత్తం 14 మంది ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకున్న లోకల్ పోలీసులు, ఆర్మీ (Army)వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అక్కడ మొత్తం ఆందోళన వాతావరణం నెలకొంది.
తమిళనాడు (Tamil Nadu)లోని కూనూరు అటవీ ప్రాంతలో బిపిన్ రావత్ (Bipin Rawat) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఒక్కసారిగా చెట్లపై కూలిపోయింది. దాంతో హెలికాప్టర్‌లో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. సైనికులు మంటల్లోంచి ముగ్గురుని కాపాడి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురిలో ఒకరు బిపిన్ రావత్ అని తెలుస్తోంది. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మరోవైపు ఐఏఎఫ్ (IAF) నాలుగు బాడీలను రికవరీ చేసుకుందట. ఆ మృతదేహాలు ఎవరిరో గుర్తించాల్సి ఉంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Also Read: IPL 2022: 'ఎంఎస్ ధోనీ వ్యక్తిగతంగా నా కెరీర్‌కు ఎంతో సాయం చేశాడు.. చెన్నై నన్ను తీసుకుంటుందో లేదో'
బిపిన్ రావత్ ()Helicopter Crash ప్రయాణం చేసింది ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్. ఇది 4వేల పేలోడ్ తీసుకెళ్లే సామార్థ్యం ఉన్న డబుల్ ఇంజన్ హెలికాప్టర్. ఇందులో 24 మంది ప్రయాణం చేయవచ్చు. ప్రమాదంకు గురైన సమయంలో హెలికాప్టర్‌లో 14 మంది మాత్రమే ఉన్నట్లు సమాచారం. 4వేల పేలోడ్ తీసుకెళ్లే సామార్థ్యం ఉన్న డబుల్ ఇంజన్ హెలికాప్టర్.. ఇలా ఉన్నట్టు ఉండి ఎందుకు కూలిందో తెలియరాలేదు. ప్రమాదంపై వాయుసేన తక్షణ విచారణకు ఆదేశించింది.
#WATCH | Latest visuals from the spot (between Coimbatore and Sulur) where a military chopper crashed in Tamil Nadu. CDS Gen Bipin Rawat, his staff and some family members were in the chopper.
(Video Source: Locals involved in search and rescue operation) pic.twitter.com/YkBVlzsk1J
— ANI (@ANI) December 8, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook