యడ్యూరప్ప ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్, జేడీఎస్ దూరం

యడ్యూరప్ప ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్, జేడీఎస్ దూరం

Last Updated : Jul 26, 2019, 11:20 PM IST
యడ్యూరప్ప ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్, జేడీఎస్ దూరం

కర్ణాటకకు 19వ ముఖ్యమంత్రిగా బూకనకెరె సిద్ధలింగప్ప యడ్యూరప్ప నేడు ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో యడ్యూరప్ప ప్రమాణస్వీకారం జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ప్రమాణస్వీకారం కోసం రాజ్ భవన్‌కి వెళ్లడానికన్నా ముందుగా బీజేపి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన పార్టీ నేతలు, కార్యకర్తలకు యడ్యూరప్ప కృతజ్ఞతలు తెలిపారు. యడ్యూరప్పకు అభినందనలు తెలియజేసేందుకు భారీ సంఖ్యలో పార్టీ నేతలు, మద్దతుదారులు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రమాణస్వీకారోత్సవానికన్నా ముందుగా కడుమల్లేశ్వర ఆలయాన్ని సందర్శించుకున్న యడ్యూరప్ప.. అక్కడ ప్రత్యేక పూజలు జరిపారు. 

ఇదిలావుంటే, యడ్యూరప్ప ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సభ్యులు గైర్హాజరయ్యారు. అసెంబ్లీలో సరైన మెజార్టీ లేకుండానే అధికారాన్ని చేజిక్కించుకోవడం అప్రజాస్వామికం అవుతుందని, అందుకే ఆయన ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్ సభ్యులు, మాజీ మంత్రులు ఎవ్వరూ హాజరవకూడదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గుండు రావు ఆదేశాలు జారీచేసినట్టుగా మీడియా అధికార ప్రతినిథి రవి గౌడ తెలిపారు.

Trending News