Haryana: మార్కెట్ అధికారిపై దాడి చేసిన బీజేపీ నాయకురాలు..

టిక్‌టాక్ స్టార్‌ నుండి బీజేపీ నాయకురాలిగా మారిన సోనాలి ఫోగాట్ హిసార్‌లోని బాల్సమండ్ మండి సందర్శన సందర్భంగా హిసార్ మార్కెట్ కమిటీ కార్యదర్శి సుల్తాన్ సింగ్‌ను స్లిప్పర్‌తో కొట్టడంతో వివాదం పెద్దదైంది.

Last Updated : Jun 5, 2020, 10:55 PM IST
Haryana: మార్కెట్ అధికారిపై దాడి చేసిన బీజేపీ నాయకురాలు..

హైదరాబాద్: టిక్‌టాక్ స్టార్‌ నుండి బీజేపీ నాయకురాలిగా మారిన సోనాలి ఫోగాట్ హిసార్‌లోని బాల్సమండ్ మండి సందర్శన సందర్భంగా హిసార్ మార్కెట్ కమిటీ కార్యదర్శి సుల్తాన్ సింగ్‌ను స్లిప్పర్‌తో కొట్టడంతో వివాదం పెద్దదైంది. సుల్తాన్ సింగ్‌ను స్లిప్పర్‌తో కొట్టడం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది ప్రేక్షక పాత్ర వహించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ లో ధాన్యంలో సేకరణ ప్రక్రియలో భాగంగా సుల్తాన్ సింగ్ అక్రమాలకు పాల్పడుతున్నాడన్నాడని రైతులు ఆరోపించడంతో ఫోగాట్ మార్కెట్ కమిటీ కార్యదర్శిపై ఫైర్ అయ్యారు. 

Also Read: Civil Services Examinations 2020: అక్టోబర్ 4న ప్రిలిమ్స్, జనవరిలో మెయిన్స్..

ఇదే క్రమంలో హిసార్‌లో సోనాలి మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ.. బాల్సమండ్ మండిలోకి ప్రవేశించగానే తనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసాడని, దీంతో నేను అలా స్పందించాల్సి వచ్చిందని ఫోగాట్ తెలిపింది. సేకరణ కేంద్రాన్ని ప్రారంభించే ఏర్పాట్లను పరిశీలించడానికి కొంతమంది రైతులతో హిసార్ మార్కెట్ కమిటీ కార్యదర్శి సుల్తాన్ సింగ్ తో కలిసి బాల్సమండ్ మండిని సందర్శించాను. నేను నా కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించానని, కానీ అతని మాటలు నన్ను బాధకు గురిచేశాయని పేర్కొంది.  

Also Read: మెరుపువేగంతో రైలుతో పాటు పరిగెత్తి పసికందుకు పాలందించిన కానిస్టేబుల్...

సుల్తాన్ సింగ్ మాట్లాడుతూ.. ఫోగాట్ తన హిసార్ కార్యాలయాన్ని సందర్శించారని, సేకరణ ఎప్పుడు ప్రారంభమవుతుందని ఆమె నన్ను అడిగారు. అయితే మండివద్ద ఏర్పాట్లు పూర్తి స్థాయిలో కాకపోవడంతో సేకరణను ప్రారంభించడానికి హఫెడ్ అధికారులు సిద్ధంగా లేరని నేను ఆమెకు వివరించానని అన్నారు. తనతో 15 నిమిషాలు మాట్లాడిన ఆమె సేకరణ ప్రక్రియ ప్రారంభం ఆలస్యం కావడంతో తనతో దురుసుగా ప్రవర్తించారన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేను సహకరించలేదని ఆమె ఆరోపించింది..

సోనాలి ఫోగాట్ ఆడంపూర్ నుండి 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఓడిపోయారు. 

 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News