బల పరీక్షకు పట్టుబడుతూ బీజేపి నేతల ధర్నా

బల పరీక్షకు పట్టుబడుతూ బీజేపి నేతల ధర్నా

Last Updated : Jul 10, 2019, 03:09 PM IST
బల పరీక్షకు పట్టుబడుతూ బీజేపి నేతల ధర్నా

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపి ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎదురుగా ధర్నాకు దిగారు. అధికారపక్షానికి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన అనంతరం జేడీఎస్-కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని, వెంటనే శాసససభలో బల పరీక్ష నిర్వహించి ప్రభుత్వం బల నిరూపణ చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ బీజేపి నేతలు కర్ణాటక విధాన సౌధ ఎదురుగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బిఎస్ యడ్యూరప్ప మాట్లాడుతూ.. తాము గవర్నర్‌ను, అసెంబ్లీ స్పీకర్‌ను కలిసి బలపరీక్ష చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తామని అన్నారు. 

అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలు సరైనవిగానే ఉన్నప్పటికీ.. స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ ఆ రాజీనామాలను ఆమోదించడం లేదని బిఎస్ యడ్యూరప్ప ఆరోపించారు. ఐదారుగురు ఎమ్మెల్యేలు సరైన ఫార్మాట్‌లోనే రాజీనామాలు సమర్పించారని స్వయంగా స్పీకరే ప్రకటించినప్పుడు.. వారి రాజీనామాలైనా ఎందుకు ఆమోదించడం లేదని యడ్యూరప్ప ప్రశ్నించారు.

Trending News