BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..

BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది. ఈ కార్యక్రమంలో  ఆ పార్టీ సీనియర్ నేత  ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షడు జేపీ సడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్‌లు పాల్గొన్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 14, 2024, 11:10 AM IST
BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..

BJP Manifesto 2024 Telugu: 2024  సార్వత్రిక ఎన్నికలకు 'సంకల్ప పత్రం'లో మోదీ గ్యారంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో ఈ మేనిఫేస్టోను తయారు చేసారు. ఈ మేనిఫేస్టోలో 14 అంశాలకు ప్రాముఖ్యత ఇచ్చారు. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 సభ్యుల కమిటీ ఈ మేనిఫెస్టో రూపకల్పనలో కృషి చేశారు..

బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు..

70 యేళ్లు పై బడిని సీనియర్ సిటీజన్స్ (వృద్దులకు) ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా రూ. లక్షల వరకు ఉచిత వైద్య బీమా..

-మూడు కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం..

-ట్రాన్స్‌జెండర్స్‌కు సైతం ఆయుష్మాన్ భారత్..

-మరో ఐదేళ్ల పాటు తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచిత రేషన్..

-పైప్‌లైన్ ద్వారా ఇంటింటికీ వంట గ్యాస్ సరఫరా..

-ముద్ర ఋణాల పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంపు..
 
-దివ్యాంగులకు ప్రత్యేక ఇళ్ల నిర్మాణం..

-మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారుణిలుగా మార్చే బృహత్తర ప్రణాళిక..

-డెయిరీ సహకా సంఘాల సంఖ్యను పెద్ద సంఖ్యలో పెంపు..

-కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త కస్టర్లు..

-మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహాం..

-చేపల ఉత్పత్తికి ప్రత్యేక ప్రాసెసింగ్‌కు సెపరేట్ క్లస్టర్లు..

-ప్రకృతి ఆధారిత వ్యవసాయానికి ప్రాధాన్యం..  

Read More: Sonu Sood: షూ చోరీ చేసిన స్విగ్గీ డెలీవరీ బాయ్ కు సోనూసూద్ అండ.. కొత్త బూట్లు కొనివ్వండంటూ ట్వీట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News