radhika sarathkumar as bjp mp candidate: నటి రాధిక శరత్ కుమార్‌కు బీజేపీ ఎంపీ టికెట్.. నాల్గో జాబితాలో కీలక నేతలు..

radhika sarathkumar as bjp mp candidate: ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఇక మొద‌టి విడ‌ద‌లో త‌మిళ‌నాడు స‌హా ప‌లు రాష్ట్రాల్లోని 102 లోక్‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌ల జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే త‌మిళ‌నాడు స‌హా దేశ వ్యాప్తంగా మూడు విడ‌త‌ల్లో అభ్య‌ర్ధుల‌కు ఖ‌రారు చేసిన బీజేపీ అధిష్ఠానం.. తాజాగా నాల్గో జాబితా విడుద‌ల చేసింది. అందులో రాధిక ప‌లువురు ప్ర‌ముఖులున్నారు.

Last Updated : Mar 22, 2024, 02:49 PM IST
radhika sarathkumar as bjp mp candidate: నటి రాధిక శరత్ కుమార్‌కు బీజేపీ ఎంపీ టికెట్.. నాల్గో జాబితాలో కీలక నేతలు..

radhika sarathkumar as bjp mp candidate: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ మొదటి విడతకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. తొలి విడతలో తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు ఎన్నికలు ముగియనున్నాయి. తొలి విడద ఎన్నికలు ఏప్రిల్ 19న నిర్వహించనున్నారు. ఇప్పటికే నామినేషన్స్ మొదలు కావడంతో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ సహా ఇతర పార్టీలు షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్రాల్లో అభ్యర్ధులను ఫైనలైజ్ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ దేశ వ్యాప్తంగా మూడు విడుతలుగా అభ్యర్ధులను ఫైనలైజ్  చేసింది. తాజాగా మొదటి విడతలో ఎన్నికలు జరగబోయే తమిళనాడుతోపాటు పుదుచ్చేరిలకు కలిపి 15 మందితో నాల్గో జాబితాను విడుదల చేసింది. ఇందులో తమిళనాడులోని విరుధు నగర్ నుంచి రాధిక శరత్ కుమార్‌కు టికెట్ ఖరారు చేసారు. రీసెంట్‌గా శరత్ కుమార్‌కు చెందిన పార్టీ బీజేపీలో బేషరుతుగా విలీనం చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 19న జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో రాధికకు టికెట్ ఇవ్వడం గమనార్హం.

ఇక ఈ ఎన్నికల్లో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తున్నారు. అటు తెలంగాణ గవర్నర్  తమిళసై సౌందర్ రాజన్.. తాజాగా తన గవర్నర్ పదవికి రాజీనామా చేసి మళ్లీ బీజేపీ కండువా కప్పుకున్నారు. అంతేకాదు ఈమెకు బీజేపీ అధిష్ఠానం చెన్నై సౌత్ ఎంపీ టికెట్ ఖరారు చేసింది.

దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో అసెంబ్లీతో పాటు లోక్‌సభకు మే 13న 4వ విడతలో ఎన్నికల నిర్వహించబోతున్నట్టు ఈసీ ప్రకటించింది. ఇక అదే రోజున తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ చేయనున్నారు. ఇక ఈ సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ మూడోసారి అధికారంలోకి రాబోతున్నట్టు మెజారిటీ సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ సారి బీజేపీ సొంతంగా 400 సీట్లు క్రాస్ చేస్తుందా అనే చర్చ మొదలైంది.

Also Read: Arvind Kejriwal: మద్యం కుంభకోణంలో అనూహ్య మలుపు.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌

Also Read: Kavitha Arrest: కవిత అరెస్ట్‌ వెనకాల ఉన్న కథ ఇదే.. ఢిల్లీ కుంభకోణం అంటే ఏమిటి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News