Bomb Under Teachers Chair: యూట్యూబ్‌ చూసి బాంబు తయారీ చేసి.. టీచర్‌ కుర్చికింద పెట్టిన విద్యార్థులు.. చివరికి ఏం జరిగిందంటే..

Bomb Under Teachers Chair: టీచర్‌ కుర్చి కింద బాంబు పెట్టిన సంఘటన హర్యానా రాష్ట్రంలో జరిగింది. ఇంతకీ బాంబు పెట్టడానికి కారణాలేంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 21, 2024, 03:53 PM IST
Bomb Under Teachers Chair: యూట్యూబ్‌ చూసి బాంబు తయారీ చేసి.. టీచర్‌ కుర్చికింద పెట్టిన విద్యార్థులు.. చివరికి ఏం జరిగిందంటే..

Bomb Under Teachers Chair: చాలా మంది గురువును దైవంగా భావిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు పెంచి పెద్ద చేస్తే.. గురువులు మాత్రం మన భవిష్యత్‌ బాగుండాలని పాఠాలు నేర్పుతారు. ఇలా టీచర్స్‌ మనకు చేసే మేలు అంతో ఇంతో కాదు. నిజానికి చాలా వరకు చదువు నేర్చుకునే క్రమంలో తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఈ సమయంలో టీచర్స్‌ మాత్రమే చదువుకోవాలని తరచుగా చెబుతూ ఉంటారు. చదువుకోవాలని మందలిస్తారు. అయితే ఈ సమయంలో పనీష్మెంట్స్‌ కామన్ అయినప్పటికీ చాలా మంది విద్యార్థులు టీచర్స్‌ వేసే పనీస్మెంట్‌ను దృష్టిలో పెట్టుకుని వారిపై పగబడుతూ ఉంటారు. ఇటీవలే ఇలాంటి సంఘటన జరిగింది. 

హర్యానాలోని కొందరు విద్యార్థులు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులంతా కలిసి ఏకంగా టీచర్‌ కుర్చి కింద బాంబు పెట్టారు. అయితే సైన్స్ టీచర్  తృటిలో గాయాలు లేకుండా ఆ బాంబు దాడీ నుంచి తప్పించుకుంది. అయితే ఆ పిల్లల టీచర్‌ కుర్చి కిందా కేవలం  బాణసంచా లాంటి బాంబులు మాత్రమే ఉంటారు. దీని వల్ల టీచర్‌ తృటిలో తప్పించుకోగలిగారు..ఇది బొపారా గ్రామంలో పాఠశాలలో జరిగింది. సైన్స్‌ చెప్పే టీచర్స్‌ తరచుగా విద్యార్థులను మందలించడంతో ఆమెపై విద్యార్థులు ఈ విధంగా పగతిర్చుకున్నారు. 

ఈ ఘటనలో 12 మంది విద్యార్థులను పాఠశాల యాజమన్యం సస్పెండ్ చేసింది. ఎప్పటి నుంచో ఈ విద్యార్థులు ఆమెపై పగపెట్టుకున్నారని చివరి ఇలా కుర్చి కింద బాంబు పెట్టారని భావించారని తెలుస్తోంది. అయితే ఈ విద్యార్థులు అంతా బాంబు తయారు చేయడానికి యూట్యూబ్‌ వినియగించినట్లు తెలుస్తోంది. అయితే దీనిని గత వారమే.. కుర్చి కింద బాంబును అమర్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫ్లాన్‌లో భాగంగా ఓ విద్యార్థి బాంబును తయారు చేస్తే.. మరో విద్యార్థి దీనికి కావాల్సిన రిమోట్‌ కంట్రోల్‌ని కూడా తయారు చేశాడు.

Also read: Broadband Plans: 15 ఓటీటీలు, 800 టీవీ ఛానెల్స్, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్

ఇలా తయారు చేసిన బాంబును ఓ విద్యార్థి కూర్చి కింది అమర్చాడు. అయితే వారు టీచర్‌ ఆ కుర్చి కింద కుర్చోగానే బాంబు ఒక్కసారిగా పేలింది. ఈ సమయంలో టీచర్‌కి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ టీచర్‌కి చిన్న చిన్న గాయాలు అయినట్లు తెలుస్తోంది. దీనిని టీచర్‌ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విద్యాశాఖకు సంబంధించిన సిబ్బంది పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. ఈ ఘటనలో 15 నుంచి 13 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంటుంది. 

Also read: Broadband Plans: 15 ఓటీటీలు, 800 టీవీ ఛానెల్స్, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News