హెడ్గే వ్యాఖలపై పార్లమెంట్ లో దుమారం.. ఉభయ సభలు వాయిదా

ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ ఉభయసభ సభ సమావేశాలను స్తంభింపజేశారు.

Last Updated : Dec 27, 2017, 12:44 PM IST
హెడ్గే వ్యాఖలపై పార్లమెంట్ లో దుమారం.. ఉభయ సభలు వాయిదా

ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ ఉభయసభ సభ సమావేశాలను స్తంభింపజేశారు. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే సెక్కులరిజం, రాజ్యాంగం మారుస్తాం అనే వ్యాఖ్యలు చేసినందుకు ప్రతిపక్ష పార్టీలు లోక్సభ, రాజ్యసభ సమావేశాలను అడ్డుకోవడంతో ఉభయ సభలు వాయిదాపడ్డాయి.

బుధవారం రాజ్యసభలో ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఈ అంశాన్ని లేవనెత్తడంతో దుమారం చెలరేగింది. "ఒక వ్యక్తికి రాజ్యాంగంపై నమ్మకం లేకుంటే, అతను పార్లమెంట్ సభ్యుడిగా ఉండటానికి హక్కుగానీ, అర్హతగానీ లేదు" అన్నారు. ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకోవడాలు ఎక్కువ కావడంతో లోక్సభ, రాజ్యసభ రెండూ మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి. 

 

అంతకు ముందు.. హెగ్డే చేసిన వ్యాఖ్యలపై లోక్సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది. మోదీ ప్రసంగంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను ప్రస్తావించడంపై రాజ్యసభలో బిజినెస్ నోటీసును కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. సభలో ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని  కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

Trending News