Burevi Cyclone updates: చెన్నై: బురేవి తుఫాన్ ( Burevi Cyclone ) ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. నాలుగు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటివరకు దక్షిణ రాష్ట్రాల్లో 10మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది ఎకరాల్లో పంట నాశనం అయింది. అయితే బంగాళాఖాతం ( Bay of Bengal ) లో ఏర్పడిన తుఫాన్ వాయుగుండంగా మారిన సంగతి తెలిసిందే. ఇది ప్రస్తుతం అల్పపీడనంగా మారిందని వాతవరణ శాఖ ( IMD ) అధికారులు తెలిపారు. Also read: #WATCH: బురేవి తుఫానుతో.. చర్చి గోడలు ఎలా కూలిపోయాయో చూడండి
తమిళనాడులోని రామనాథపురం-గల్ఫ్ ఆఫ్ మన్నార్ తీరంవద్ద వాయుగుండం స్థిరంగా కొనసాగుతూ అల్పపీడన ప్రాంతంగా మారిందని (low pressure at gulf of mannar) వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది 48 గంటలకుపైగా తీరప్రాంతంలో స్థిరంగా ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వెల్లడించింది. అయితే.. మరో 24 గంటల తర్వాత వర్షాలు తగ్గుముఖం పడుతాయని వెల్లడించింది.
Also read: Rashmika Mandanna: కాటుక కళ్లతో కవ్విస్తున్న రష్మిక..
Also read: Shraddha Das: ఫొటోలతో హీటెక్కిస్తున్న శ్రద్ధా దాస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Burevi Cyclone: అల్పపీడనంగా మారిన వాయుగుండం
బురేవి తుఫాన్ (Burevi Cyclone) ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి.
నాలుగు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటివరకు దక్షిణ రాష్ట్రాల్లో 10మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
తమిళనాడులోని రామనాథపురం-గల్ఫ్ ఆఫ్ మన్నార్ తీరంవద్ద వాయుగుండం స్థిరంగా కొనసాగుతూ అల్పపీడన ప్రాంతంగా మారిందని (low pressure at gulf of mannar) వాతావరణ శాఖ ప్రకటించింది.