Rakesh Surana: ప్రస్తుత సమాజంలో డబ్బే సర్వస్వం అయింది. మనీ చుట్టే అంతా తిరుగుతోంది. ఆస్తుల కోసం బంధాలను కాదనుకుంటున్నారు. సొంతవారిని వదిలేస్తున్నారు. హత్యలకు కూడా తెగబడుతున్నారు. 10 రూపాయల కోసం చంపేసిన ఘటనలు చూస్తున్నాం. కాని కొందరు మాత్రం ఇందుకు విరుద్ధం. సేవా కార్యక్రమాలతో పేదలకు అండగా నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మధ్యప్రదేశ్ లో వెలుగుచూశారు. తాను కష్టపడి సంపాందించిన ఆస్తిని మొత్తం దానం చేశారు.
మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ కు చెందిన వజ్రాల వ్యాపారి రాకేశ్ సురానా.. తన 11 కోట్ల రూపాయల విలువైన మొత్తం ఆస్తిని విరాళాంగా ఇచ్చారు గోశాలతో పాటు ఆధ్యాత్మిక సంస్థలకు తన ఆస్తి రాసిచ్చారు రాకేశ్ సురానా. తన భార్య కొడుకుతో కలిసి ఆధ్యాత్మిక జీవితం గడపాలని నిర్ణయించుకున్నాడు. మే 22న దీక్ష తీసుకోబోతున్నారు. గురు మహేంద్ర సాగర్ స్పూర్తితోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సురానా తెలిపారు.ఆస్తి మొత్తం దానం చేసిన రాకేష్ సురానాను స్థానికులు ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన కుటుంబాన్ని రథంలో ఊరేగించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సురానాను ఘనంగా సన్మానించారు.
రాకేశ్ సురానా చిన్నతనం నుంచి కష్టపడి పైకి వచ్చారు. బాలాఘాట్ లో చిన్న దుకాణంతో ఆయన వ్యాపారం మొదలైంది. తర్వాత ఒక్కో మెట్టు పైకి ఎదిగారు. డబ్బు సంపాందించడంతో పాటు సేవా కార్యక్రమాలతో స్థానికంగా అందరి అభిమానం చూరగొన్నారు. పేదలకు సాయం చేయడంతో ఎప్పుడు ముందుండే సురానా.. ఇప్పుడు ఏకంగా మొత్తం ఆస్తిని దానం చేసి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సురానా భార్య లీనా అమెరికాలో చదువుకున్నారు. బెంగళూరు యూనివర్శిటీలో ఉన్నత విద్య అభ్యసించారు. లీనా తల్లి 2017లో దీక్ష తీసుకున్నారు. కాని క్యాన్సర్ తో ఆమె చనిపోయారు. లీనా సోదరి కూడా 2008లో దీక్ష తీసుకున్నారు. వాళ్ల బాటలోనే సురానా కుటుంబం మే22న జైపూర్ లో దీక్ష తీసుకోనుంది.
READ ALSO: Big Shock To TRS: కేసీఆర్ కు బిగ్ షాక్! కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ సీనియర్ నేత..
READ ALSO: Supreme Court on GST: జీఎస్టీపై భారత సర్వోన్నత న్యాయ స్థానం కీలక తీర్పు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook