12వ తరగతి ఫలితాలను సీబీఎస్ఈ కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. గతంలో పోలిస్తే ఈ సారి పాస్ పర్సంటేజీ ఒక శాతం పెరిగి 83.01 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మార్చి 5 నుంచి 13వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఢిల్లీలో ఎకనామిక్స్ పేపర్ లీకేజీ వ్యవహారంతో ఈసారి ఫలితాలు కాస్త ఆలస్యంగా విడుదలయ్యాయి. లీకైన పేపర్‌ను ఏప్రిల్ 25న నిర్వహించింది సీబీఎస్ఈ బోర్డు. ఈ ఏడాది 11.06 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. అందులో 9,18,763 మంది పరీక్షలు ఉత్తీర్ణులయ్యారు.
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌కు చెందిన మేఘనా శ్రీవాస్తవ పరీక్షల్లో 500కి 499 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. రెండవ స్థానంలో ఉత్తర ప్రదేశ్ కు చెందిన అనౌశ్క శర్మ (498), రాజస్థాన్ కు చెందిన చహాట్ బోధ్రాజ్ (497) మూడవ స్థానంలో ఉన్నారు. త్రివేండ్రం(97.32%), చెన్నై(93.87%), దిల్లీ(89%) అత్యధిక మార్కులు సాధించిన రీజియన్స్‌గా నిలిచాయి. మొత్తంగా బాలురకంటే బాలికలదే ఫలితాల్లో హవా కనిపించింది. బాలురు 78.99 శాతం, బాలికలు 88.31 శాతం ఉత్తీర్ణత సాధించారు.
అటు 10వ తరగతి పరీక్షా ఫలితాలను జూన్ మొదటి వారంలో విడుదల చేస్తామని సీబీఎస్ఈ వెల్లడించింది. 12వ తరగతి ఫలితాల కోసం క్లిక్ చేయండి. ఈసారి విద్యార్థులు గూగుల్ ద్వారా కూడా తమ ఫలితాలను తెలుసుకునే సదుపాయాన్ని సీబీఎస్‌ఈ కల్పించింది.
సీబీఎస్ఈ క్లాస్ 12 ఫలితాల కొరకు..
1. విద్యార్థులు cbse.nic.in, cbseresults.nic.in, results.nic.in అధికారిక వెబ్సైట్లను సందర్శించి ఫలితాలను తెలుసుకోవచ్చు. మీ రోల్ నెంబర్, స్కూల్ నెంబర్, సెంటర్ నెంబర్‌ను నమోదు చేసి సబ్మిట్ బటన్ నొక్కితే మీ రిజల్ట్ వస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.
2. విద్యార్ధులు వారి రోల్ సంఖ్య, పుట్టిన తేదీ నమోదు చేసి SMS ద్వారా ఫలితాలను పొందవచ్చు. SMS ఫార్మాట్: cbse12 <రోల్ సంఖ్య> <పాఠశాల నెంబర్> <సెంటర్ నెంబర్> టైప్ చేసి 7738299899కు SMS పంపండి (లేదా) MTNL - 52001, BSNL - 57766, ఎయిర్సెల్ - 5800002, ఐడియా - 55456068, టాటా టెలీ సర్వీసెస్ - 54321, 51234 5333300, ఎయిర్టెల్ - 54321202, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ - 9212357123ల ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
3. DigiLocker (https://digilocker.gov.in/), UMANG మొబైల్ యాప్‌ల ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.
4. IVR సేవల ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు. మీ ఫలితాలను పొందడానికి ఈ నెంబర్లకు కాల్ చేయండి:
ఢిల్లీలో ఉన్న వారు : 24300699
ఇతర ప్రాంతాలవారు : 011- 24300699