CBSE Results 2022: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి, 12వ తరగతి టర్మ్ 2 పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఫలితాల తేదీలను సీబీఎస్ఈ బోర్డు ఇప్పటికైతే అధికారికంగా ప్రకటించలేదు. ఈ నెలాఖరున 10వ తరగతి, జూలై రెండో వారంలో 12వ తరగతి టర్మ్ 2 పరీక్షా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వాల్యూయేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తి కావొచ్చిందని.. త్వరలోనే ఫలితాల తేదీని వెల్లడిస్తామని సీబీఎస్‌ఈ వర్గాలు చెబుతున్నాయి.
సీబీఎస్ఈ 10, 12 తరగతుల టర్మ్ 2 ఫలితాలను ఈ వెబ్‌సైట్స్ ద్వారా చెక్ చేసుకోవచ్చు :
cbseresults.nic.in
results.gov.in
digilocker.gov.in
UMANG యాప్‌లోనూ ఫలితాలను పొందవచ్చు.
ఫలితాలు చెక్ చేసుకోండిలా :
మొదట cbseresults.nic.in అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
వెబ్‌సైట్ హోమ్ పేజీలో పరీక్షా ఫలితాల ఆప్షన్‌పై క్లిక్ చేయండి
ఇప్పుడు మీ తరగతి (క్లాస్ 10 లేదా క్లాస్ 12)ని ఎంచుకోండి
హాల్ టికెట్ నంబర్, తదితర వివరాలను సబ్‌మిట్ చేయండి
అంతే.. స్క్రీన్‌పై మీ పరీక్షా ఫలితాలు కనిపిస్తాయి
ఫలితాలను ప్రింటవుట్ తీసుకుని ఉంచుకోండి.
ఈ ఏడాది దాదాపు 35 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ 10, 12 టర్మ్ 2 పరీక్షలు రాశారు. ఇందులో 21 లక్షల మంది క్లాస్ 10, మరో 14 లక్షల మంది క్లాస్ 12 పరీక్షలు రాశారు. ఏప్రిల్ 16 నుంచి జూన్ 15 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు.
Also Read: 1983 World Cup: భారత క్రికెట్ చరిత్రలోనే.. ఎప్పటికీ మర్చిపోలేని రోజుకు 39 ఏళ్లు!
Also Read: Vikram Rare Feat : కమల్ మాస్.. లెక్కలు మాములుగా లేవుగా.. అరుదైన రికార్డులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.