Farmers protest vs Twitter accounts: ఆ ఎక్కౌంట్లు బ్లాక్ చేయాలంటూ కేంద్రం నోటీసులు

Farmers protest vs Twitter accounts: కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా నడుస్తున్న రైతుల ఆందోళనపై ఆంక్షలు విధించనున్నారు. గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన హింసాత్మక ఘటనల నేపధ్యంలో ట్విట్టర్ ఖాతాలపై దృష్టి పెట్టిన కేంద్రం..పెద్దఎత్తున ట్విట్టర్ ఖాతాల్ని బ్లాక్ చేయాలంటూ నోటీసులిచ్చింది.

Last Updated : Feb 8, 2021, 11:53 AM IST
  • రైతుల ఆందోళనపై నిఘా పెట్టిన కేంద్ర ప్రభుత్వం
  • రైతు ఆందోళనకు సంబంధమున్న 1178 ట్విట్టర్ ఎక్కౌంట్లను బ్లాక్ చేయాలంటూ ట్విట్టర్ సంస్థకు నోటీసులు పంపించిన కేంద్రం
  • ప్రమాదకర హ్యాష్‌ట్యాగ్‌లతో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు
Farmers protest vs Twitter accounts: ఆ ఎక్కౌంట్లు బ్లాక్ చేయాలంటూ కేంద్రం నోటీసులు

Farmers protest vs Twitter accounts: కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా నడుస్తున్న రైతుల ఆందోళనపై ఆంక్షలు విధించనున్నారు. గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన హింసాత్మక ఘటనల నేపధ్యంలో ట్విట్టర్ ఖాతాలపై దృష్టి పెట్టిన కేంద్రం..పెద్దఎత్తున ట్విట్టర్ ఖాతాల్ని బ్లాక్ చేయాలంటూ నోటీసులిచ్చింది.

కేంద్ర ప్రభుత్వం ( Central government ) తీసుకొచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాల్ని( Farm laws ) రద్దు చేయాలంటూ గత కొద్దికాలంగా రైతుల ఆందోళన ( Farmers protest ) నడుస్తోంది. గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ ( Farmers Tractor Rally )లో జరిగిన హింసాత్మక ఘటనల నేపధ్యంలో ట్విట్టర్ ఖాాతాలపై కేంద్ర ప్రభుత్వం కన్నేసింది. ముఖ్యంగా ఖలిస్తాన్ సానుభూతిపరులతో లేదా పాకిస్తాన్ లింకులున్న ఖాతాల్ని బ్లాక్ చేయాలంటూ సోషల్ మీడియా దిగ్గజమైన ట్విట్టర్ ( Twitter )‌కు నోటీసులిచ్చింది. తప్పుడు సమాచారంతో రైతుల మారణహోమం వంటి ప్రమాదకరమైన హ్యాష్‌ట్యాగ్‌ ( Hashtag )లను ట్రెండ్ చేస్తున్న 250 ఖాతాల్ని బ్లాక్ చేయాలని కేంద్రం ఇటీవల కోరింది. కొన్ని రోజుల తరువాత ఇప్పుడు మళ్లీ నోటీసులిచ్చింది. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా రైతుల ఆందోళన ( Farmers protest )పై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ..రైతుల్ని రెచ్చగొడుతున్న పాకిస్తాన్, ఖలిస్తాన్‌తో సంబంధాలున్న 1178  ఖాతాల్ని తొలగించాలని కేంద్రం కోరింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నాయని ఆరోపించింది. 

మరోవైపు ట్విట్టర్ ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్ మహిమా కౌల్ తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. వ్యక్తిగత కారణాల రీత్యా పదవి నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. ఈ వివాదానికి ఆమె రాజీనామాకు సంబంధం లేదని భావిస్తున్నా..కొందరు పెద్దల ఒత్తిడితో కౌల్ రాజీనామా ఉండవచ్చని భావిస్తున్నారు. చట్టాల్ని వెనక్కి తీసుకునేవరకూ ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

Also read: Sasikala to Chennai: నేడు చెన్నైకు శశికళ..అడ్డుకునేందుకు నిఘా వలయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News